
PILLALA BOMMALA RAMAYANAM - 60
₹60
In stock · 308 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రామాయణం "మా నిషాద ప్రతిష్టాంత్వమ్ ఆగమశ్శాస్వతీన్సమాః యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ కామ మోహితమ్" అన్నశాపమే జగత్ప్రసిద్ధమైన రామాయణ సృష్టికి మూలం. ఒకనాడు వాల్మీకి మహర్షి తమసా నదికి స్నానానికి వెడుతూ అచటో తమాల వృక్షంపై క్రీడించు క్రౌంచపక్షుల జంటలో నొకదాన్ని పడగొట్టిన బోయవానిని చూసి పెట్టిన శాపమిది. అలా శపించాడేగాని తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన బోయవానిపై నిగ్రహాన్ని కోల్పోయినందుకు ఎంతగానో శోకించాడు. ఆ శోకంలోంచే యీ శ్లోక మావిర్భవించింది. ఆ శ్లోకంలోని ఛందోరీతికి సరస్వతీ నిష్యందనానికీ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. "మహర్షీ! శోకించకు. నీ శోకాలు శ్లోకాలుగా మార్చు. నీకిదే భూత భవిష్యద్వర్తమానకాలాల దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నా. నా ఆశీస్సులతో ఇదే ఛందో రీతిలో రామాయణ రచన గావించు. నీవు తరించి లోకాన్ని తరింపజేయ్. ఈ భూతలంపై నగములెంతవరకు నిలుస్తాయో, నదులెంతవరకు నడుస్తాయో అంతవరకూ రామాయణ కథ లోకమందు ప్రకాశిస్తుంది" అని వాల్మీకి మహర్షికి వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. వాల్మీకి తన రామాయణానికి కథావస్తువుగా రఘువంశాన్ని తీసుకున్నాడు. సర్వకాల సర్వావస్థలకు నిలువగల, నాయకునిగా ఏకపత్నీవ్రతుడైన పితృవాక్పరిపాలకుడైన రామభద్రుని ఎన్నుకున్నాడు. నాయికగా అష్టకష్టాల్ని, అగ్ని పరీక్షల్నీ అధిగమించి స్త్రీత్వానికి, సతీత్వానికి చిహ్నమైన జానకీదేవిని నిలబెట్టుకున్నాడు. తనవాక్కులో ప్రౌఢిమను, మనోహరశిల్పాన్నీ పొదిగించాడు. లలితకోమల పదజాలాన్ని పలికించాడు. తొలుతగా దివ్యతేజస్వులు, రఘురాముని యశో తనయులైన కుశలవులచే రామభద్రుని ముందే గానం చేయించాడు. అలా తరతరాల పునశ్చర్వణంతో తాళపత్ర లిఖితమైంది- పవిత్ర రామాయణ మహాకావ్యం.