
PILLALA KATHALU - 60.00
by ACHARYA CHALLA RADHAKRISHNA SARMA
₹60
In stock · 596 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ 1929లో జన్మించిన చల్లా రాధాకృష్ణశర్మ యం.ఏ., యం.లిట్., పిహెచ్.డి. డిగ్రీలు పొందారు. ఆంధ్ర, మదరాసు విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం. "తెలుగు, తమిళ సాహిత్యాలలో రామాయణం” అనే సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్ వచ్చింది. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో బాల సాహిత్యం, కవిత, విమర్శ మొదలైన ప్రక్రియల్లో 80కి పైగా పుస్తకాలు (అనువాదాలతో సహా) ప్రచురించారు. పబ్లికేషన్స్ డివిజన్, నేషనల్ బుక్ ట్రస్ట్, దక్షిణ భాషా పుస్తక సంస్థ మొదలైన వాటికి తహిళం, ఆంగ్లములలోంచి పిల్లల పుస్తకాలు చాలా అనువదించారు. మౌలిక రచనలూ చేశారు. కొన్ని రచనలకు ఆంధ్ర, తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు బహుమతులు ఇచ్చాయి. దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ వారికి బాలల పాటలు రాసి, రికార్డు చేశారు. చాలాకాలం కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణ ప్రాంతం కార్యాలయ కార్యదర్శిగా, ఆ తర్వాత మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేసి రిటైరయ్యారు. యు.జి.సి. ఎమెరిషస్ ఫెలోగా నియుక్తులు వీరిని పెక్కు సాహిత్య సాంస్కృతిక సంఘాలు సన్మానించాయి. మారిషస్, సింగపూర్ మొదలైన విదేశాలలో పర్యటించారు. సాహిత్య అకాడమీ అనువాద బహుమతి, సోవియట్లాండ్ నెహ్రూ అవార్డు మొదలైనవి పొందారు.