
PILLALA PEMPAKAM
by K.SURESH
₹25
In stock · 3 available
PublisherHYDERABAD BOOK TRUST
LanguageTelugu
పిల్లల పెంపకం - సమ్మర్ హిల్ అనుభవాలు స్వేచ్ఛలేని శిశువు ప్రపంచం నలు మూలల్లోనూ స్వేచ్ఛ లేని పిల్లలున్నారు. క్రమశిక్షణ, కట్టుబాట్ల పేర అతన్ని అణచి వేసి, మూసపోస్తారు. ఏ మాత్రం ఉత్సాహం కలిగించని బడిలో, ఉత్సాహం కలిగించని బల్ల ముందు కూర్చుని ఉంటాడు. ఆ బాలుడు పెద్దయ్యాక అంతకంటే నీరసమైన ఉద్యోగం చేస్తుంటాడు. స్వేచ్ఛ లేని బాలుడు చాలా మందకొడిగాను, అధికారానికి తల ఒగ్గడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానూ ఉంటాడు. అందరిలా ఉండాలని ఎంతో తాపత్రయ పడుతుంటాడు. తనకు చెప్పిన ప్రతి దాన్నీ ప్రశ్నించకుండానే అంగీకరిస్తాడు. తన భయాలను, సమస్యలను చివరికి తన పిల్లలకు సంక్రమింప చేస్తాడు. మొదటి అయిదు సంవత్సరాలలో పిల్లలకు చాలా వరకు నష్టం జరుగుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. అయితే జీవితాంతం మిగిలిపోయే నష్టం మొదటి అయిదు నెలల్లోనే, అయిదు వారాల్లోనే, ఇంకా చెప్పాలంటే మొదటి అయిదు నిమిషాల్లోనే జరుగుతుందనటం సత్యానికి ఇంకా దగ్గర. స్వేచ్ఛ లేకపోవటం పుట్టుకతోనే మొదలవుతుంది. వాస్తవానికి ఇది పుట్టుక ముందు నుంచి కూడా మొదలు కావచ్చు. అణచివేతకు గురయిన స్త్రీ శరీర స్వభావం శిశువుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఎవరు చెప్పగలరు? మన నాగరికతలో పిల్లలు జీవ-వ్యతిరేక వాతావరణంలో పెరుగుతున్నారన్నది అతిశయోక్తి కాదు. ఉదాహరణకు సమయం ప్రకారం శిశువుకి పాలు పట్టటం అన్న విషయాన్నే తీసుకుందాం. ఇది మౌలికంగా శిశువుకు ఆనందాన్ని, మాతృ స్తన్యం వద్ద సంతృప్తిని నిరాకరిస్తుంది. సమయం ప్రకారం పాలు పట్టటం పోషణ దృష్ట్యా మంచిదనటం పైకి చెప్పే సాకు మాత్రమే. శిశువుని చిన్నప్పటి నుంచే ఆనందాని కంటే బాధ్యతకు అలవాటు చెయ్యటం దీని ఉద్దేశం. గ్రామర్ స్కూల్కి' వెళ్ళే ఒక సగటు పిల్లవాడి జీవితాన్ని పరిశీలిద్దాం. అతని పేరు జాన్స్మత్ అనుకుందాం. అతని తల్లిదండ్రులు అప్పుడప్పుడు మాత్రమే చర్చికి వెళుతుంటారు. కానీ జాన్ మాత్రం 'ఆదివారపు బడి' (సండే స్కూలు) కి క్రమం తప్పకుండా వెళ్ళాలని పట్టుబడతారు. ఒకరంటే ఒకరికి ఉన్న లైంగికార్షణ వల్ల అతని తల్లిదండ్రులు దగ్గరయ్యారు. పెళ్ళి చేసుకుంటే తప్ప సమాజంలో మర్యాదస్తులుగా జీవించటానికి లైంగికార్షణ ఒక్కటే సరిపోదు. సహజంగానే స్వభావాల్లో తేడాలు పొడసూపాయి. పెద్దగా అరుచుకోవటం, పోట్లాడుకోవటం మామూలైపోయాయి. అరకొర మధుర క్షణాలు కూడా లేకపోలేదు. జానికి ఇవి సహజంగా కనిపించేవి. కానీ పోట్లాటలనే అర్థం 1) యూరపులో మగపిల్లలో కోసం జీతాలు లేకుండా నడిపే సెకండరీ స్థాయి బడులను గ్రామర్ స్కూల్ అంటారు. 2) ఆదివారం బడి : చర్చిలో మతప్రబోధకులకు సహాయం చేసే అనేక అనుబంధ సంస్థలున్నాయి. వీటిల్లో అతి పెద్దది ఆదివారం బడి. పెద్దలకు, పిల్లలకు ఇది మతపరమైన బోధన చేస్తుంది. ప్రొటెస్టెంట్ చర్చిలలో మతపరమమైన బోధన గావించే ముఖ్య పద్ధతులలో ఆదివారం బడి ఒకటి.