
PILLALU ADIGE PEDDA PRASNALU
₹30
In stock · 1 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
పిల్లలు అడిగే పెద్ద ప్రశ్నలు... ఆదెళ్ళ శివకుమార్... పిల్లలూ ఈ పుస్తకం మీకోసం... పిల్లలూ ఈ పుస్తకం టైటిల్ చూసారా? పిల్లలు అడిగే పెద్ద ప్రశ్నలు. అవును మీబుర్రలు చిన్నవే కానీ మీకు వచ్చే సందేహాలు మాత్రం ఒక్కోసారి మీ పెద్దవారిని తికమక పెట్టేస్తాయి. మీరుఅడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పులేక అప్పుడప్పుడు వారు ఇబ్బంది కూడా పడుతుంటారు. చిన్నప్పుడు నేను కూడా మీలాగే ఉండేవాడిని. బుర్రనిండా బోలెడన్ని సందేహాలతోనన్నమాట. ఇదంతా మీదో ఎందుకు చెప్తున్నానంటే ఈమధ్య చిన్నపిల్లలకు ఏదైనా మంచి పుస్తకం రాసి ఇవ్వండి అని నా పబ్లిషర్స్, అడిగినప్పుడు నా చిన్నతనం నాకు గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు ఏం చూసినా అది అలా ఎందుకు? ఇది ఇలా ఎందుకు? అని మన పెద్దవారిని అడుగుతాం కదా! అలా చిన్న పిల్లకాయలకు వచ్చే పెద్ద పెద్ద సందేహాల గురించి ఒక పుస్తకం రాస్తే బావుంటుంది అని అనిపించింది. అంతే మీకోసం నేను పుస్తకం మొదలు పెట్టాశానోచ్.... అందరూ చిన్న పిల్లల కోసమే రాసామంటూ మా పేరు చెప్తున్నారు. కానీ ఆ పుస్తకాలు చదువుతుంటే మాకు ఏమీ అర్ధం కావడంలేదు అని అంటారు కదూ... మీ మాటలలో నిజం ఉందర్రా...నేను కూడా మీకోసం రాసిన కొన్ని పుస్తకాలు చదివాను. మీరన్నట్టు నాకు కూడా మీకులానే ఏమీ అర్ధం కాలేదు. అయితే ఇలా చదవడం వలన చిన్న పిల్లలకు సరైన పుస్తకాలు లేకపోవడం... వలన మీరు ఎంత బాధపడుతున్నారనేది మాత్రం అర్ధం అయ్యింది.. అయితే ఈ పుస్తకం మిగతా పుస్తకాలకుమల్లే మీకు అర్ధం కాని భాషలోను ఉండదు...మీకు అర్ధం కానీ సంగతులు ఉండవు. ఇది పూర్తిగా మీకోసం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాపిన పుస్తకం. ఇంతకీ ఈ పుస్తకంలో మాకు వచ్చే ఏమంత పెద్ద సందేహాలు ఉన్నాయి అని అడుగుతారా!? చెప్తాను వినండి... .