PILLALU MEEKOSAM VAIGNANIKA KATHALU by SURYA PRASADARAO Telugu book cover

PILLALU MEEKOSAM VAIGNANIKA KATHALU

by SURYA PRASADARAO

₹40
In stock · 7 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట... నిత్య సౌకర్యాల వెనక సైన్స్ కథలు "తాతా తాతా కథ చెప్పవూ!" అని ఓ మనవడో, మనవరాలో అడిగితే నేటి ఇరవై ఒకటవ శతాబ్దపు తాత 'అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు...! అంటూ కధ మొదలుపెట్టడు. 'కంప్యూటర్ కధ చెప్పమంటారా... ఇంటర్నెట్ విశేషాలు వివరించమంటారా...' అని అడుగుతాడు. కధలంటే పిల్లలైనా... పెద్దలైనా చెవి కోసుకుంటారనే ప్రేరణే యిలా వైజ్ఞానిక కధల రూపకల్పనకు అంకురార్పణ జరిపింది. ఆదిమ మానవ జీవితం నుండి నవనాగరికతా పథం వైపు మానవజాతిని నడిపించింది సైన్సే! అసలు వండుకోవడం చేతకాని వయసు నుండి పంచభక్ష్య పరమాన్నాలు పండించుకుని వండుకుని తినే మనస్సును సృష్టించింది కూడా సైన్సే! మనం తింటున్న తిండీ, కట్టుకునే దుస్తులు, ఉంటున్న యిల్లు, క్షణక్షణం అనుభవించే సౌకర్యాలను అమర్చిందీ సైన్సే! నాడు దివ్యదృష్టి ఉందో... లేదో... తెలియదు గానీ... ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏ సంఘటన జరిగినా మన యింటిలో.. కళ్ళముందు ప్రత్యక్షం చేయించేదీ సైన్సే! ప్రపంచాన్నే 'గ్లోబల్ విలేజ్ గా మార్చిందన్నా... ఎక్కడ వున్నా ప్రక్కనే వున్నట్లు అవతలి వారి సంభాషణ వినిపింపచేసినా... అపరిమితమైన అనూహ్యమైన సౌకర్యాలను అమర్చిందన్నా... ఆ చలువ సైన్స్ దే! అందుకే.. మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనల వెనుకనున్న సైన్స్ విశేషాలను సేకరించి పిల్లలకు అర్ధమయ్యే రీతిలో.. చిన్న కధలుగా రూపొందించి అందించాలనే ప్రయత్నమే 'తెలుసుకుందాం' అనే పిల్లల వైజ్ఞానిక కధల సమాహారం! 'సముద్రం నీలంగా ఎందుకుంటుంది! ఈ బుల్లి నాన్న పిల్లల్ని కంటాడు, మైక్రోఓవెన్ ఎలా పనిచేస్తుంది? బాష్పవాయువంటే ఏమిటి? మొదలైన అనేక అంశాలను కథలుగా మలిచి సరళమైన భాషలో... అంతకంటే సులభమైన, సహజమైన సన్నివేశాలుగా రూపొందిన యీ కధలు ఆనందంతో బాటు విజ్ఞానాన్ని కూడా కలిగించాలనే ఆకాంక్ష! కలిగిస్తాయనే ఆశ! వివిధ వైజ్ఞానిక విషయాలను మొట్టమొదట ఆవిష్కరించిన నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్, ఐన్ స్టీన్ మొదలు నేటి గ్రెగ్వెంటర్ వరకు యీ వైజ్ఞానిక కధా సంకలనానికి ప్రేరణ కలిగించారు. నిత్యం పత్రికలలోనో, మాగజైన్లలోను విజ్ఞానాన్ని అనేక వ్యాసాలుగా, అంశాలుగా విస్తరింప చేస్తున్న 'శాస్త్ర విజ్ఞాన వ్యాప్తకులకు... గత ముప్పై రెండు సంవత్సరాలుగా శీలం సిద్ధారెడ్డి జ్యోతి కళాశాల జంతుశాస్త్రోపన్యాసక అవకాశం కల్పించిన కళాశాల పాలక అధ్యక్షులు శ్రీ కె. రామ్మోహన్ గారికి, నిత్యం ప్రోత్సహించే ప్రిన్సిపల్ డా॥డి.ఆర్. బోస్ గార్కి, ఈ కథా సంకలనం రూపుదిద్దుకోవడానికి, అక్షర 'రూపం దాల్చడానికి, ముద్రాక్షరాలుగా మీముందుకు రావడానికి ముఖ్య కారకులైన శ్రీ మధులతా పబ్లికేషన్స్ అధినేత శ్రీ వి.యల్.నరసారెడ్డి గార్కి కృతజ్ఞతలు అర్పించుకుంటూ.... సూర్యప్రసాదరావు