PINZARI - SHAIK NAZAR ATMA KATHA by ANGADALA VENKATA RAMANAMURTHY Telugu book cover

PINZARI - SHAIK NAZAR ATMA KATHA

by ANGADALA VENKATA RAMANAMURTHY

₹75
In stock · 17 available
PublisherANGADALA VENKATA RAMANAMURTHY
LanguageTelugu
ఆ రోజు నా రాత బాగలేక- ఏ రాగాలు యెక్కువగా అంటారు మీ కధలో అని అడిగాను నాజరుగారిని. ఆయన నవ్వు బిగపట్టుకుని నీకేం తెలుసో చెప్పు నాకేం తెలుసో చెప్తా అన్నారు. నేను చేతులు కట్టుకుని కళ్ళు మూసుకుని తోడి, శ్యామ, భీంప్లాస్, ముఖారి, మాల్కాస్, ఆనందభైరవి, కానడ, శ్రీ తిలకా మోదు, మోహన, శివరంజని, కాఫీ, షణ్ముఖప్రియ, వుదయరవిచంద్రిక, కేదారగౌళ, భైరవి, సింహేంద్ర మధ్యమ, కళ్యాణి, గూడూరుసావిత్రిగారు... హరిశ్చంద్ర అడివి సీను, బాలభాగమ్మ... బాలవర్థి త్రూ అవుట్, గయోపాఖ్యానం... అర్జునుడు వార్సిన్, చింతామణి... భవాని త్రూ అవుట్ ఆడతానండీ అన్నాను ఆపకుండా. ఆయన గట్టిగా నవ్వేశారు. - ఎందుకయ్యా ఆ వణుకు! మధ్యలో ఆ గూడూరు సావిత్రి ఏమిటి? అన్నారు. ఆమె పక్కన నేను హరిశ్చంద్రుడు ఆడానండీ అది మీకు ఎట్లయినా చెప్పాలని నా తాపత్రయం. ఆమె రాగాల మధ్యలో వచ్చేసింది అన్నాను కొంచెం భయం తగ్గి. అయినా మా అరుణక్క అంటే నాకు భయమే. ఆరేళ్ళ పాటు ఆమెతో దాగుడుమూతలాడుతూ నాజరుగారిమీద డాక్టరేటు చేసి అప్పుడు ఆ బైండు పుస్తకం ఆమె ముందు పెట్టాను. ఆమె ఆ దిండును తిరగేసి- సవటా ! ఇందులో ఆత్మ ఏదిరా - ఆత్మ గూడా వుందక్కా అని కొన్ని చిత్తుకాయితాలు పట్టుకొచ్చి చూపిచ్చా, అవి ఆ ఆరేళ్ళ కాలంలో అడపా దడపా నాజరు గారు చెబుతుంటే నేను రాసుకున్న ఆయన ఆత్మకథ. అవి చూసి సగమేరాశావు. ఇంకో సగమేదిరా అంది మళ్ళీ. ఇంకో సగమేమిటో నాకు అర్ధంకాలేదు. అప్పటికి నాజరు గారు చనిపోయారు. తర్వాత బోధపడింది. అప్పుడు వెళ్ళి ఆ సగం రాసుకొచ్చాను. ఆ సగం అదంబీ గారే. `అప్పట్లో నేను ఎక్కువసేపు నాజరు గారితో మాట్లాడితే ఆయన ఆరోగ్యం బావుండదని ఆమె కోప్పడేవారు. అంతే తెలుసు నాకప్పుడు. నేను పారిపోయివచ్చేవాడిని. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన అడిగే తొలిమాట అన్నం తిన్నావా అయ్యా అని, ఆయన పోయిన తరవాత కూడా నాకు ఆ ఇంట్లో అదే మాట -అన్నం తిన్నావా అయ్యా అని వినిపించింది. ఈసారి ఆ మాట ఆదంబీ గారిది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నాజరుగారనేవారు నాకు యింకా నీతో మాట్లాడాలనే వుందిగానీ ఇల్లాలు వూరుకోదయ్యా అని. కానీ ఇప్పుడు ఆ ఇల్లాలు పులుస్టాప్ లేకుండా ఆయన గురించి మాట్లాడుతూనే వుంది. నాటుకోడి గోయించి అప్పటికప్పుడు యింత నూని, కొత్తిమీర తెప్పించి చాపేసి పెద్ద కంచం నిండా అన్నం మొదలూ మారూ ఒకేసారి పెట్టింది. తిన్నంత కూర.