PONNA POOLA CHETTU by DR.DEVARAJU MAHARAJU Telugu book cover

PONNA POOLA CHETTU

by DR.DEVARAJU MAHARAJU

₹100
In stock · 814 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Maharaju ఈ పుస్తకంలోని జానపద కథల్లో పిల్లల్ని ఆనందపరిచే హాస్యం, విస్మయం కలిగించే కల్పనలు, మాయలు మాత్రమే కాక, వారి దృష్టిని మానవత్వం వైపు మళ్ళించగల శక్తి వుంది. ఇందులో అక్కడక్కడ కనిపించే దేవుడూ, దయ్యం నిజంగా ఉండవని, అవి కేవలం భ్రమలు, ఊహలు మాత్రమేనని పిల్లలకు చెప్పాలి. అవి మంచీ చెడులకి ప్రతీకలని పిల్లలు గ్రహించేట్లు చెయ్యాలి. జీవితం ఎంత అత్యాధునికంగా మారిపోయినా, అంతర్గతంగా మానవ జీవన మూలాలు, విలువలూ అలాగే వున్నాయి. అవి ఇంకా సౌందర్యవంతమవుతూ ఉండాలి. సాంఘిక జీవనంలోని అవకతవకల, చేదు నిజాల హెచ్చుతగ్గుల పరిచయం ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇవి కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలు కూడా చదివి ఆనందించదగ్గవి. ఈ పుస్తకంలో జంతువుల కథలు, మనుషుల కథలూ ఉన్నాయి. జంతునైజం గల మనుషుల కథలకంటే మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం మేలు. వ్యక్తిత్వ వికాస దిశగా ఈ కథలు దిశా నిర్దేశం చేయగలవన్న ప్రగాఢ విశ్వాసం మాకుంది.