
POOJAKU VELAYERAA
by DR.SMT.D.R.L.RAJESWARI CHANDRAJA
₹55
In stock · 21 available
PublisherDR.SMT.D.R.L.RAJESWARI CHANDRAJA
LanguageTelugu
ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి వుంది. అక్కడక్కడ బయటపడుతున్న నీలాకాశం... మళ్లీ అంతలోనే కప్పేస్తున్న మేఘాలు... ప్రియుడి ముఖాన్ని తనివితీరా ముద్దు పెట్టుకుంటున్న ప్రియురాలి జుట్టు మాటిమాటికీ అతడి ముఖాన్ని కప్పేస్తుంటే... అపురూపంగా ఆమెకురుల్ని కాస్త తప్పించగానే అతడి ముఖం కొద్దిగా కనబడ్డట్టుగా వుందా దృశ్యం... ఉండుండి వీచే చల్లనిగాలి... గుండెల్లో తెలియని గుబులు రేపుతోంది... జూలై వెళ్లిపోతోంది... సిసలైనవానాకాలం రోజులు... వర్ష రుతువు మొదలైంది... చెప్పాలంటే కొత్త జంటలకి కష్టకాలం... కాస్త పాతబడ్డ జంటలకి ఇష్టకాలం! టప్పున రాలిందొక చినుకు... సరాసరి నేరుగా గులాబి మొగ్గపై రాలింది... రేకుల్ని తప్పించుకుని... లోపలికి జారింది. చాలా అద్భుతంగా వుందా దృశ్యం... బాల్కనీలో కేన్ వుయ్యాలలో కూర్చున్న ఆశ్లేష గుండె జల్లుమంది... ఆమె పై పంటికింద కింది పెదవి నలుగుతోంది. లేత గులాబిరంగు అధరాలు సన్నగా వణుకుతున్నాయి. దానిమ్మగింజల్లాంటి ఆమె పలువరుస తళుక్కుమంది. ఆమె చాలా అందమైనది. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. ఆషాఢం... పుట్టింటికి వచ్చింది. ఆమెకి పొద్దు పోవడం లేదు. అన్నింటికీ ముందు వరసలో ఆమె భర్త కౌశల్ గుర్తుకొస్తున్నాడు. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆశ్లేష... ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసింది... విద్యావతి అందగత్తె ఆమెకు సంబంధాలు రావటం కష్టం కాలేదుగానీ కుదరడమే కష్టం అయింది. ఆమె అందానికి చదువుకీ సరిపడే జోడీ కోసం ఆమె తల్లి తండ్రులు గాలించవలసి వచ్చింది. చక్కని చామనచాయ కలిసిన తెలుపురంగు. గోధుమ వన్నె త్రాచులాంటిరంగు,