
POOLA RUTHUVU - MARIKONNI PREMA KATHALU
₹200
In stock · 10 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
వాడ్రేవు వీరలక్ష్మీదేవి పూల ఋతువు మరికొన్ని ప్రేమకథలు డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి వెలువరిస్తున్న నాలుగవ కథాసంపుటి ఇది. మంచి చెడుల ప్రసక్తిని పక్కన పెట్టి, మానవ జీవితాన్నీ, అందులోని సంవేదనలనీ గొప్ప నిర్మాణ కౌశలంతో అధ్యయనం చేయించగలిగేది గొప్పకథ అని నమ్మిన రచయిత్రి వెలువరిస్తున్న కథలివి. నాలుగు దశాబ్దాలుగా కథారచన చేస్తూన్నప్పటికీ, రాశిలో ఎక్కువగా లేకపోయినా, రాసిన ప్రతి ఒక్క కథనీ సున్నితమైన, సునిశితమైన పాఠకులు గుర్తుపెట్టుకునే లాంటి కథలు రాశారు. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం వేళ్ళూనుకోకముందే '24 కారెట్' (1983) లాంటి కథ రాసిన ఈ కథకురాలి కథల్లో ఎక్కువ శాతం స్త్రీలే ఉంటారని మనం ఊహించగలం. స్త్రీల తాలూకు కష్టాల్ని వల్లెవేయడం కన్నా వాటిని ఎదుర్కొంటున్న స్త్రీల అంతరంగంలోకి ప్రయాణించడం మనకి ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథలు ప్రసంగించవు. ప్రచారానికి పూనుకోవు. అందుకు బదులు పాఠకుల్తో ఒక ఆత్మీయ సంభాషణ సాగిస్తాయి. పాలగుమ్మి పద్మరాజుగారిలాగా వస్తువునీ, శిల్పాన్నీ సమతూకంతో నిర్వహించగల ఇటువంటి కథకుల్ని నేడు తెలుగులో వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.