POTETHINA KERATANNI by GITA HARIHARAN Telugu book cover

POTETHINA KERATANNI

by GITA HARIHARAN

₹275
In stock · 7 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076503
నీళ్లు స్వేచ్ఛగా పారే ఆ నేల ఎక్కడుంది? ఎంతో శక్తిమంతంగా గీతా హరిహరన్ ఊహల్లోంచి వచ్చిన నవల. ఈ కల నిజమయ్యేందుకు సముద్రాలెన్నడు పోటెత్తుతాయని ప్రశ్నిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం చిక్కడు అనే మాదిగ యువకుడు, సమానత్వం సాధించిన ఆనంద గ్రామం వెళ్తాడు. చిక్కయ్యగా, ఆశు కవిగా మారతాడు. అతని కొడుకు కన్నదేవుడనే భక్తి కవిగా ప్రసిద్ధి పొందుతాడు. ఆనంద గ్రామం ప్రజలు అగ్రకుల దురహంకారానికి బలైపోతారు. కాలక్రమంలో కన్నదేవుడిని కూడా అగ్రవర్ణాలు తమలో కలుపుకుని, తమ రంగు పులుముతాయి. సాహిత్య పరిశోధకుడైన ప్రొఫెసర్ కృష్ణ కన్నదేవుని గతాన్ని తవ్వి అతని నేపథ్యాన్ని తాళపత్ర గ్రంథాల ఆధారంగా వెల్లడి చేస్తాడు. తమవాడనుకున్న కన్నదేవుడు నిజానికి మాదిగ వాడనీ, అతని తండ్రి బట్టలుతికే వృత్తి చేశాడనే నిజాన్ని భరించలేని హిందుత్వ వాదులు ప్రొఫెసర్ కృష్ణను కాల్చి చంపేస్తారు. సత్య, రవి, ఆషా ముగ్గురూ దళిత విద్యార్థులు, తాము అనుభవించే వివక్షకు కుంగిపోతూ, ఎదురు తిరుగుతూ, మథనపడుతూ ఉంటారు. ప్రొఫెసర్ కృష్ణ పుస్తకం వీరికి ఉత్తేజం కలిగిస్తే, ఆయన హత్య వారిని కల్లోలంలోకి నెడుతుంది. కాలేజీలో అగ్రకుల ప్రొఫెసర్ పెట్టే హింసను భరించలేని సత్య ఆత్మహత్య చేసుకుంటాడు. రవి, ఆషాలు పోరాడి తీరాలనే నిశ్చయంతో పోటెత్తిన కడలి తరంగాలుగా మారతారు. మూడు కథలను, వర్తమాన చరిత్రతో, రాజకీయాలతో కలిపి అల్లిన చిక్కని నవల 'పోటెత్తిన కెరటాన్ని'.