PRAAPTHAM - VIHARI KATHALU by VIHARI Telugu book cover

PRAAPTHAM - VIHARI KATHALU

by VIHARI

₹125
In stock · 1 available
PublisherCHINUKU PUBLICATIONS
LanguageTelugu
బతుకు పుస్తకాల్లో అధ్యాయాలు నింపేది ‘ఆర్ధికాంశ’ కలమే!! సమాజ గ్రంథాలయంలో పరిశీలిస్తే ఎన్నో రకాలైన బతుకు పుస్తకాలు కనబడతాయి. ఈ బతుకు పుస్తకాల్లో ఎన్నెన్నో భేధాలు, విభేధాలు. లింగం, వయసు, మనస్తత్వం, అనుభవం మొవలైనవెన్నో బేధవిభేదాల్ని కలిగించే అంశాలు. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ అంశాలన్నిటినీ మించిన అంశం ఒకటి కనిపిస్తుంది. లింగమేదైనా, వయసెంతైనా, ఏ మనస్తత్వమైనా, అనుభవమున్నా లేకున్నా ప్రతి బతుకు పుస్తకానికీ ఏకసూత్రత కలిగించే అంశం అది. బతుకు పుస్తకం లిఖించే కలంలో డబ్బుసిరా బాగా ఉంటే అధ్యాయాలన్నీ ఆనందంగా రొమాంటిక్ గా సాగుతాయి. ఇంకింకిపోతే అప్పుడు ప్రారంభ మౌతాయి అధ్యాయాల్లో కొట్టివేతల తిట్టివేతల తీసివేతలు. బ్రతుకు కథలు అవుతాయి చితుకు వ్యధలు. ఇటువంటి రెండు బతుకు పుస్తకాల్ని రెండు కథలుగా అందించారు. 'విహారి' జె.యస్.మూర్తి, సామాజిక 'స్పృహ'తో 'గోరంతదీపం' వెలిగించి, ఆ వెలుగులో 'గుండెలో కోయిల'ల్ని కథల 'అక్షరం'గా మంచి, 'అమ్మపేరు చీకటి'గా పేరుకుంటూ 'బొంగరం'లా గతిశీలకమైన నడకతో 'కొత్తనీరు'లా ప్రవహిస్తూనే ఉన్న కథనశిల్పి. 'పోల్చుకోగలరాతే' అన్నది రెంటిలోను ఒక కథ. ఈ కథలోని బతుకు పుస్తకం రిటైరై చరమాంకానికి చేరిన పుంలింగం. ఆదివారం ఆంధ్రభూమిలో 10 మే 2009న వచ్చింది. రిటైరైన ఓ ముసలితండ్రి ముఖ్యపాత్ర, తన కథని తానే ప్రథమ పురుషలో చెప్పుకునే ఈ పాత్రకి పేరే లేదు. కథలో ముఖ్యపాత్రే అయినా, పేరే లేకుండా చేయడం, అతని బతుకు పుస్తకంలో అతనే 'అప్రాధాన్యత' అయిపోవడాన్ని చెప్పకనే చెబుతుంది. కథకుడి చాతుర్యం ఈ చిన్న విషయంలోనే ఎంతో బాగా అర్థమవుతుంది. అనామకుడి బతుకు పుస్తకంలోని వేరే పాత్రలు మనవరాలు ఉషారాణి, కోడలు వనజ, కొడుకు చంద్రం, మనవడు ప్రభాకర్ అందరూ తమ తమ అవసరాల కోసం డబ్బులు అడుగుతూనే ఉంటారు. చాలా కొద్ది మొత్తాన్ని పాకెట్ మనీగా ఉంచుకుని, పెన్షన్ రాగానే డబ్బంతనీ కొడుక్కి ఇస్తుంటాడు అనామకుడు. అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినా అడుగుతూనే ఉంటారు.