PRACHEENA BHARATA SAMAJAMLO BANISALA STITIGATHULU by UPPALA LAXMANARAO Telugu book cover

PRACHEENA BHARATA SAMAJAMLO BANISALA STITIGATHULU

by UPPALA LAXMANARAO

₹75
In stock · 127 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రాచీన భారత సమాజంలో బానిసల స్థితిగతులు వాల్డెర్ రూబెన్ 1899 జనవరిలో జర్మనీలో జన్మించారు. మొదటి నుండీ భారత చరిత్ర, సంస్కృతీ అధ్యయనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తుండేవారు. 1935లో హిట్లరు అధికారంలోకి రాగానే, యూదు జాతీయుడైన రూబెన్- టర్కీకి ప్రవాసం వెళ్ళారు. అంకారా, ఇస్టాంబుల్ విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పదవి నిర్వహిస్తూ కృష్ణ, రామాయణం, కాళిదాసు అను మూడు గ్రంథాలు వెలువరించారు. హిట్లర్ పతనానంతరం తూర్పుజర్మనీ వెళ్ళి, హంబోల్డు విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతీ అధ్యయన విభాగానికి అధిపతి అయినారు. ప్రాచీన భారతదేశ చరిత్రను గురించిన పెక్కు ఉద్గ్రంథాలు రచించారు. అనేకసార్లు భారతదేశం సందర్శించారు. డా|| ఉప్పల లక్ష్మణరావు 1898లో బరంపురంలో జన్మించారు. బరంపురం, మద్రాసు, కలకత్తాలలో చదువు పూర్తిచేసి, B.Sc. (Hons) డిగ్రీ సంపాదించి, జర్మనీలోని జుబింగర్ విశ్వవిద్యాలయంలో plant physiology లో 1924 డాక్టరేట్ డిగ్రీ సంపాదించారు. స్వదేశానికి వచ్చిన మీదట, కలకత్తాలోని జె.సి.బోసు పరిశోధనా కేంద్రంలోనూ, కాకినాడ P.R. కాలేజీలోనూ, ఆలీఘర్ విశ్వవిద్యాలయంలోనూ బాటనీ ఫ్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. జాతీయ పరిశ్రమల స్థాపనలో భాగంగా 1937లో విజయవాడలోని ఆంధ్ర సిమెంటు కంపెనీ స్థాపనకు తోడ్పడ్డారు. ఆ కంపెనీ Sales Manager గా 1954 వరకు సుమారు 15 సంవత్సరాలు పనిచేశారు. 1958 - 70 వరకు మాస్కోలో ప్రగతి ప్రచురణాలయం ప్రధాన తెలుగు అనువాదకులుగా ఉండి అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలు అనువదించారు. 'అతడు - ఆమె' నవల ద్వారా ఆంధ్ర సాహితీ లోకంలో సుస్థిర స్థానం సంపాదించారు. * వారి సతీమణి స్విస్ దేశస్తురాలైన మెల్లీ షోలింగర్, భారత జాతీయోద్యమంలో పాల్గొని పెక్కుసార్లు జైలుశిక్ష అనుభవించారు. ఆమె 1965లో చనిపోయారు. శ్రీ లక్ష్మణరావుగారు 1985లో మరణించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్