
PRACHEENA BHARATHADESA CHARITRA-160
₹160
In stock · 1989 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అధ్యాయం: 1 ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యత భారతదేశ చరిత్రను అధ్యయనం చేయటానికి కారణాలున్నాయి. మనదేశంలో అత్యంత ప్రాచీనమైన ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి యా • అధ్యయనం మనకు చెబుతుంది. వారి జీవితాలకు కాన్ని భద్రతనూ ఇచ్చిన వ్యవసాయాన్ని వారు ఎలా వారో అది సూచిస్తుంది. ప్రాచీన భారతీయులు వనరుల్ని ఎలా కనుగొన్నారో, వాటిని తమ అవసరా ఎలా ఉపయోగించుకున్నారో, నిత్యావసరవస్తువుల్ని ఎలా ర్డుకున్నారో చూపుతుంది. వ్యవసాయం, నూలు బట్టలు నేయటం మొదలైన వృత్తుల్ని వారు ఎలా ముటున్నారో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయటంద్వారా తెలుసుకోవచ్చు. పల్లెల్నీ, పట్టణాలనీ, చివరగా పెద్ద జ్యాల వారు ఎలా స్థాపించారో కూడా మనం అర్థం శాత నేర్చుకోనంతవరకూ ఎవరూ ఎవర్నీ నాగరికులుగా ణించరు. ఈనాడు భారతదేశంలో వాడుకలో ఉన్న కాతపద్ధతులన్నీ ప్రాచీన లిపుల్లోనుంచి వచ్చినవే. ఈనాడు మనం ఉపయోగిస్తూ ఉన్న భాషలు కూడా అలా వచ్చి " ఈనాడు మనం ఉపయోగిస్తున్న భాషలకు వేళ్ళు ప్రాచీన కాలంలోనే ఉన్నాయి. ఈ భాషలు అనాటినుంచీ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినవే. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అనేక జాతుల నివాసభూమి కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్యులకు కార్వులూ, ఇండో - ఆర్యులూ, గ్రీకులూ, సీథియాన్లూ, వాణులూ, తురుష్కులూ మొదలైన జాతులవారు భారత దేశాన్ని తమ నివాసభూమిగా చేసుకున్నారు. భారతీయ సామాజిక వ్యవస్థా, కళలూ, సాహిత్యమూ అభివృద్ధి చెంద బానికి ప్రతి జాతీ తన వంతు దోహదాన్ని చేసింది. ఈ ప్రజలూ, వారి సంస్కృతీ విడదీయటానికి వీలులేనంతగా కలిసిపోయాయి. ఈనాడు వాటిలో ఒక్క అంశాన్ని కూడా దాని అసలు రూపంలో గుర్తించటానికి వీలులేదు. ఉత్తర దక్షిణాల, తూర్పు పడమరల సాంస్కృతిక లక్షణాలు ఒకటిగా సమ్మేళనం చెందటం ప్రాచీన భారతదేశ చరిత్రలోని ఆశ్చర్యకరమైన అంశం. ఆర్య లక్షణాలు ఉత్తర భారతానికి చెందిన వైదిక, సంస్కృతభాషా సంస్కృతికి చెందినవి. పూర్వ ఆర్య లక్షణాలు దక్షిణ భారతానికి చెందిన ద్రావిడ, తమిళ సంస్కృతికి చెందినవి. క్రీ.పూ. 1500–500 కాలానికి చెందిన వైదిక సాహిత్యంలో అనేక ద్రావిడ భాషా పదాలూ, సంస్కృతేతర పదాలూ కనిపిస్తాయి. అవి అవైదిక దక్షిణ భారతానికి చెందిన భావాలనూ, వ్యవస్థలనూ, ఉత్పత్తులనూ, జానపదాలనూ సూచిస్తాయి. అలాగే క్రీ.పూ. 300 క్రీ.శ. 600 సంవత్సరాలకు చెందిన అత్యంత ప్రాచీన "సంగం" తమిళ సాహిత్యగ్రంథాల్లో అనేక పాళీ, సంస్కృత పదాలు కనిపిస్తాయి. అవి గంగామైదానాల్లో అభివృద్ధి చెందిన భావాలనూ, వ్యవస్థలనూ సూచిస్తాయి. ఆర్యులకు పూర్వులైన గిరిజన జాతుల నివాస భూమి అయిన తూర్పుప్రాంతంకూడా ఈ ఉమ్మడి సంస్కృతికి తన వంతు దోహదం చేసింది. ఈ ప్రాంతం ప్రజలు ముండా, కొలారియన్ భాషల్ని మాట్లాడుతారు. పత్తి ఉపయోగం, సముద్రయానం, తవ్వకపుకర్ర మొదలైన వాటిని సూచించే ఇండో-ఆర్యన్ పదాలు ముండా భాషల్లోనుంచే వచ్చాయని భాషాశాస్త్ర వేత్తలు భావిస్తారు. ఛోటానాగపూర్ పీఠభూమిలో అనేక ముండా జనపదాలు కనిపించినా, ముండా సంస్కృతి అవశేషాలు ద్రావిడ సంస్కృతి అవశేషాలంత బలంగా లేవు. బ్రాహ్మణ సంస్కృతీ, ముండాసంస్కృతీ ఒకదానితో మరొకటి కలిసిపోయాయి. వైదిక భాష యొక్క ఉచ్చారణలో, పదప్రయోగంలో వచ్చిన మార్పులకు ద్రావిడ ప్రభావం కంటే ముండా ప్రభావమే ముఖ్యమైన కారణం. ఆ మార్పుల్ని ముండా ప్రభావం ఆధారంగానే మరింత చక్కగా, సమగ్రంగా వివరించవచ్చు. ప్రాచీన కాలం నుంచీ కూడా భారత దేశంలో మతాలున్నాయి. హిందూమతం, జైనమతం, బౌద్ధమతం