PRACTICAL SEX GUIDE by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

PRACTICAL SEX GUIDE

by SHANMUKESWARA PRACHURANALU

₹100
In stock · 3 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట గతంతో పోలిస్తే... ఇటీవలి కాలంలో రెండు విషయాలపై ప్రజలలోని ఆసక్తి బాగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అవి ఒకటి సైకాలజీకి సంబంధించిన విషయాలు, రెండవది లైంగిక విజ్ఞానానికి సంబంధించినవి. సమాజం లోను, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితంలోను ఇటీవల చాలా స్పీడుగా వస్తున్న మార్పులు, ధోరణులు ఈ మార్పుకు ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మనిషి మనస్తత్వానికి, మానసిక డా|| ఇండ్ల రామసుబ్బారెడ్డి ఆరోగ్యానికి సంబంధించి రెండు దశాబ్దాల క్రిందటి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు వరకు ప్రజల్లో పెద్దగా అవగాహన గాని, చైతన్యం గాని లేవు. అంతకు మించి... మనిషి తన లైంగిక జీవితం, దాంపత్య జీవితం గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఒకవేళ దాంపత్య జీవితంలో ఏవైనా ఒడుదుడుకులొచ్చినా, ఆ విషయాలను మిగతా ఆరోగ్య సమస్యలంత ఫ్రీగా డాక్టర్లతో గాని, ఇతరులతో గాని చెప్పుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితికి ముఖ్య కారణం మనలో సెక్సు గురించిన సరియైన అవగాహన లేకపోవడం, రెండవది అలాంటి విషయాల గురించి నల్గురిలో ఫ్రీగా చెప్పుకోవడంపై ఉన్న ఆంక్షలు. వ్యక్తిగతంగా ముఖాముఖిగా చెప్పుకోలేని ఈ లైంగిక సమస్యల కొరకే ఇటీవల దాదాపు అన్ని పత్రికల్లోకూడా లైంగిక విజ్ఞానానికి సంబంధించిన డాక్టర్ల కాలమ్స్, ప్రశ్న-సమాధానాలు ప్రచురిస్తున్నారు. కేవలం పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ సెక్స్ విజ్ఞానానికి సంబంధించిన కాలమ్స్ బాగా చదువుతున్నట్లు కొన్ని సవ్వేలలో తేలింది. తన భార్చకో, భర్తకో ఏదైనా లైంగిక సమస్య ఉన్న దంపతులు... వారిని డాక్టరు దగ్గరకు తీసుకేళ్ళే వీలు లేనప్పుడు, ఈ విధంగా పత్రికా ముఖంగా తమ సమస్యలకు సలహాలు తీసు కుని వాటికి పరిష్కారం కనుగొంటున్నారు. మనదేశంలో అర్హత కల్గిన సెక్సాలజిస్టులు చాలా తక్కువనే చెప్పాలి. అటువంటి కొద్దిమందిలో బొంబాయికి చెందిన డా॥ ప్రకాశ్ కొఠారి, మగ్రాసుకు చెందిన డా॥ డేగా నారాయణ రెడ్డి గార్లు ముఖ్యులు. మన రాష్ట్రానికి సంబంధించి అలాంటి క్వాలిఫైడ్ సెక్సాలజిస్టులు ఎవరూ లేకపోయినా సాధారణ వైద్యులైన డా॥ సమరం గారు గత పాతిక సంవత్సరాలుగా సెక్స్ విజ్ఞానాన్ని బరించి సా నూన్య ప్ర లకు తెలియ చెప్పేందుకు పత్రికల ద్వారా, కొన్ని లైంగిక విజ్ఞాన సుస్తకాల రచనల ద్వారా ఎంతో కృషి చేశారు.... చేస్తున్నారు.