
PRADHAMA BHAGAMU - VISWA BRAHMANA SARVASVAMU - VISWA BRAHMANA PRAMUKHULU
by DR.RAPAKA EKAMBRARACHARYULU
₹400
In stock · 22 available
PublisherDR.RAPAKA EKAMBRARACHARYULU
LanguageTelugu
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్ని యోగాలు కలిగిన మహాయోగి. పుట్టుకతోనే వారు యోగశక్తులన్నీ పొందిన మహాయోగి, త్రికాలజ్ఞులు, కాలజ్ఞానం చెప్పిన వారిలో వీరబ్రహ్మేంద్ర స్వామి అగ్రగణ్యులు. వారు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపారు. వేమన వంటి యోగి, వీరబ్రహ్మం వంటి గురువు, సిద్దయ్య వంటి శిష్యులు లేరని చెప్పుకోవడం లోకంలో వాడుకలోనున్నమాట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు శ్రీమతి ప్రకృతాంబ, పరిపూర్ణాచార్యుల గారల కుమారులు, కర్ణాటకలోని కోలారు జిల్లా చిక్క బళ్ళాపురం తాలూకాలోని నందికొండ సమీపంలోని పాపఘ్ని మఠాధిపతులైన వీరపాపమాంబ, వీరభోజాచార్యులు వీరంభోట్లయ్యను (వీరబ్రహ్మం) పెంచి పెద్దచేశారు. వారే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి వీరంభొట్లయ్య అను పేరుపెట్టారు. వారు స్వామివారిని పెంచారు. వీరంబొట్లయ్య 13 సం॥రాలు వయస్సు వచ్చే నాటికే అన్ని విద్యలలో అరితేదారు. అవాటికి తండ్రి మరణించాడు. తల్లికి వీరంబొట్లయ్య పిండోత్పత్తి క్రమం, జీవుని చతుర్దశ లక్షణాలు చెప్పి, యోగాలు బోధించి తల్లి అనుమతితో తీర్థయాత్రలకు బయలుచేరారు. తుదకు కర్నూలుజిల్లాలోని బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మగారి గోవులను మేపే గోపాలుడుగా కొంతకాలమున్నారు. వీరంభోట్లయ్య రవ్వల కొండపై ఆవులను మేపి జుజ్జేరులో నీరు త్రాగించి సాయంకాలానికి అచ్చమ్మగారింటికి తీసికొనివచ్చేవారు. అవులు మేస్తున్న సమయంలో వీరప్పయ్య రవ్వలకొండ గుహలో కాలజ్ఞానం వ్రాసుకొనేవారు. ఆ విధంగా వ్రాసిన కాలజ్ఞాన పత్రాలు అచ్చమ్మ ఇంటిలో పాతరలో దాచేవాడు. ఒకనాడు వీరప్పయ్య రవ్వల కొండ గుహలో కాలజ్ఞానం వాస్తుండగా అచ్చమ్మ చూచి వారిని అసాధారణ బాలకునిగా గుర్తించింది. వీరప్పయ్య ఒకనాడు అచ్చమ్మను యాగంటేశ్వరుని ఆలయం వద్దకు తీసుకొనివెళ్లి అక్కడ ద్వాదశాక్షరీ మంత్రం ఉపదేశించి జరుగబోయే కాలజ్ఞానం వినిపించారు. అచ్చమ్మ లోమరం పేరుతో ఒక ప్రత్యేక మఠం కట్టించింది. అక్కడ వీరప్పయ్య భక్తులకు జ్ఞానోపదేశం చేసేవారు. ఇక్కడ అన్నాజయ్య అనే బ్రాహ్మణునకు జ్ఞానోపదేశం చేశారు. ఇక్కడ అన్నాజయ్య వీరప్పయ్య శిష్యుడైనాడు. ఈ శిష్యునకు శివ పంచాక్షరి, నారాయణాక్షరి మంత్రాలను బోధించాడు.