
PRADHAMIKA HOMIEO VYDYAMU
₹120
In stock · 69 available
PublisherHANIMAN HOMIEO MANAVA SEVA SAMSTA
LanguageTelugu
హోమియో వైద్యం గురించి! వైద్య విజ్ఞానానికి నాలుగు మూల స్తంభాలుగా ప్రసిద్ధి చెందిన మహా వ్యక్తులు నలుగురు. వీరే గ్రీకు దేశస్థులైన హిప్పోక్రటిస్, గాలెన్ మరియు జర్మనీ దేశస్తులైన పారాసెల్సస్, హానిమన్ క్రీస్తుకు పూర్వం 460-477 మధ్యకాలంలో జీవించిన హిప్పోక్రటీస్ వైరుధ్యాలను, వైరుధ్యాలతో నయం చేయాలనే అల్లోపతి వైద్య సూత్రానికి, సారూప్యాలను, సారూప్యాలతోనే నయం చేయాలనే సారూప్య వైద్య సూత్రానికి రెండు సూత్రాలకు కూడా మూలపురుషుడు. కాఫీ తరువాత కాలంలో వచ్చిన గ్రీకువైద్యుడు గాలెన్ సమయంలో వైరుధ్య సూత్రం ప్రాభవాన్ని సంతరించుకోగా సారూప్య సూత్రం మరుగున పడిపోయింది. ఆ తరువాత 18వ శతాబ్దంలో జీవించిన హానిమన్ ఆనాడు అల్లోపతి వైద్య విధానంలో అమలులో ఉన్న అనాగరిక పద్ధతులను ఖండిస్తూ ప్రయోగం, పరిశీలన, పరిశోధన ప్రాతిపదికలుగా సారూప్య ఔషధ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా, కళాత్మకంగా రూపొందించి హెూమియో వైద్య పితామహుడుగా పేరు ప్రతిష్ఠలు గడించాడు. ప్రపంచ వైద్య సిద్ధాంత గ్రంథాలలో ముఖ్యంగా చెప్పబడేవి రెండు. 1. హిప్పోక్రటీస్ రచించిన హెప్పారిజం, 2. హానిమన్ రచించిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. 1810 సం||లో ప్రచురించబడిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ 294 వైద్య సూత్రాలను సుభాషితాల రూపంలో వ్రాయబడింది. ఈ సూత్రాలను ప్రతి హెూమియో వైద్యుడు అధ్యయనం చేసి, అవగాహన చేసుకొని తు.చ. తప్పకుండా పాటించవలసి ఉన్నది. ఈ గ్రంథ పరిజ్ఞానం లేకుండానే హెూమియో వైద్యమును ఆచరించువారు తమ వృత్తియందు విఫలురై ఈ వైద్య విధానానికే కళంకం తెచ్చెదరు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో వ్రాయబడిన మొత్తం 294 సూత్రాలలో, మొదటి రెండు సూత్రాలు ఒక భాగం, తరువాత 292 సూత్రాలు రెండవ భాగంగా పరిగణించవచ్చును. 1వ సూత్రము : వ్యాధి పీడుతుని మరలా ఆరోగ్యవంతునిగా చేయుటయే వైద్యము యొక్క ఏకైక కర్తవ్యమై యున్నది. దీనిని నివారణ అని పిలిచెదము. 2వ సూత్రము : శాశ్వతముగా, త్వరితంగా, సున్నితంగా ఆరోగ్యమును మరలా చేకూర్చుటయే నివారణ యొక్క అత్యున్నత ఆదర్శమై యున్నది.