PRAGATHI PAATALA THOTA - LALITHA GEETALU by J.BAPUREDDY Telugu book cover

PRAGATHI PAATALA THOTA - LALITHA GEETALU

by J.BAPUREDDY

₹200
In stock · 8 available
PublisherJ.BAPUREDDY
LanguageTelugu
నా మాట నేను ఎంతోకాలంగా పద్య, గేయ, వచన కవిత ప్రక్రియల్లో రచనలు చేస్తున్నాను. ఏ ప్రక్రియలోనైనా కవిత రాయడం కంటే "కవిత చేయడం” కష్టతరమైందని నా విశ్వాసం. అలాగే ఇతివృత్తపరంగా, "మనిషి"ని నడిపిస్తున్న సామాజిక, ప్రణయాత్మక, ఆధ్యాత్మిక చింతనలు భావ వైవిధ్యాన్నే గాని వైరుధ్యాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదనే అభిప్రాయం కలిగిన వాణ్ణి నేను. అందుకే నా కవితా దృక్పథం వస్తుపరంగా, ప్రక్రియాపరంగా, జీవితమంత విశాలమైందనే స్ఫూర్తితో గత 5 దశాబ్దాలకు పైగా రచనలు చేస్తున్నాను. ఇప్పుడు నేను 75వ ఏట ప్రవేశిస్తున్న శుభసందర్భంలో నా ఆప్తమిత్రులు కొందరు శ్రీ కె. లక్ష్మారెడ్డి, అశోకా బిల్డర్స్ సంస్థ చైర్మన్, అధ్యక్షతలో "బాపురెడ్డి సాహిత్య సేవా మహోత్సవాలు 2010" పేరుతో ఒక కమిటీని ఏర్పరుచుకొని, ఓ సంవత్సరం పాటు, నా రచనల ప్రచురణలు, నా సాహిత్య దృక్పథం మీద సదస్సులు నిర్వహించా లని పూనుకున్నారు. వారి అభిమానానికి పులకించిపోయిన నేను సరే అన్నాను. అందులో భాగంగానే ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఈ "ప్రగతి పాటల తోట" లలితగీతాల సంపుటిని ఆవిష్కరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో కమిటీ సభ్యులుగా సహకారాన్ని అందిస్తున్న డా॥ ఎస్. కొమరయ్య, శ్రీ జి. మాధవరెడ్డి, శ్రీ ఎం. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. కొండలరావు, డా|| జి. ఉపేందర్ రెడ్డి, డా|| జయప్రకాశడ్డి, శ్రీ జె. మారుతి, శ్రీ పి. మహేందర్ రెడ్డి వంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. సినీగీతాలు, లలిత గీతాలు ప్రజాదరణ పొందుతున్న కాలం ఇది. అయితే లలిత గీతాలు ఎక్కువగా దైవభక్తికి, ప్రణయచింతనకు చెందినవిగా ఉంటున్నాయి. దేశభక్తికి, సామాజిక ఆర్థిక ప్రగతికి చెందిన ఇతి వృత్తాలతో తగినంత లలిత గేయ సాహిత్యం వెలువడటం లేదు. మానవతా విలువలు, ప్రజాసంక్షేమానికి దోహదం చేసే భావజాలం, సామాన్య ప్రజల జీవితాన్ని స్పృశించే కోణాలు ప్రతిబింబించే పాటలు ఆధునిక తెలుగు కవితా రంగంలో ఇతోధికంగా వెలువడవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం.