PRAGATHI PATHAMLO BHARATHA MAHILA by JANUMADDI HANUMACCHASTRI Telugu book cover

PRAGATHI PATHAMLO BHARATHA MAHILA

by JANUMADDI HANUMACCHASTRI

₹120
In stock · 139 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట ప్రపంచదేశాలన్నింటిలోనూ నాగరిక సమాజంలో "ఆకాశంలో సగం" అంటున్న, సమాజంలో క్రమేణ సగం అవుతున్న మహిళ, చరిత్రలో మాత్రం అనామకురాలే. ఆమె పోషించిన ముఖ్యపాత్ర తల్లిగా, సేవకురాలిగా, భోగ్యవస్తువు గానే. చెదురుమదురుగా మనకు మహారాణులున్నా, మహిళ వహించిన పాత్ర ఫ్యామిలి మెంబెర్గానే. చివరికి అక్కడా నిర్ణయాధికారంలేని సేవకురాలే. ఆధునిక యుగారంభంలో, అంటే 19వ శతాబ్దిలో మహిళ, ముఖ్యంగా భారతీయ మహిళలో చైతన్యం ప్రారంభమయింది. ఆ చైతన్యాన్ని పట్టి ఇచ్చే గ్రంథం ఇది. 'ప్రగతి పథంలో భారత మహిళ అనే పేరుతో జానమద్ది హనుమచ్చాస్త్రిగారు అనేక మంది భారతీయ మహిళల సంక్షిప్త జీవన రేఖలు గ్రంథంగా కూర్చారు. వీరంతా భారతదేశ చరిత్రలో ఆధునిక యుగారంభం నుంచి ఈనాటి వరకు వివిధ రంగాలలో కృషిచేసి, తమ ముద్రను సమాజంమీద వేసినవారే. ఈ మహిళల్లో జన్మతః విదేశీయులైనవారున్నారు వారు భారతదేశం వచ్చి భారతీయ సమాజానికి సేవలందించినవారు. మదర్ థెరిస్సా, ఆనీ బిసెంట్, పాండిచ్చేరి శ్రీమాత (మదర్), సోదరి నివేదిత, చెన్నైలో చిల్డ్రన్స్ గార్డెన్ స్కూలు స్థాపించిన ఎలెస్ట్రషముల్లర్ (శర్మ) అటువంటి వారే. జన్మతః భారతీయులైనాగాని విదేశాలలో కృషిచేసిన మీరానాయర్ వంటివారి జీవనరేఖలూ ఇందులో ఉన్నాయి. సంగీతం, నాట్యం, నటన మొదలైన కళారంగాల్లో తమ ముద్ర వేసిన ఆనాటి బెంగుళూరు నాగరత్నమ్మ నుంచి ఇటీవలి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి, ఇప్పటి లతామంగేష్కర్, యామినీ కృష్ణమూర్తి వంటి కళాకారిణుల జీవిత పరిచయాలూ ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమ సమరంలో తమ విభిన్న దృక్పథాలతో ఉద్యమకృషి నిర్వహించిన లక్ష్మీ సెహగాల్. అరుణా అసఫ్లీ వంటి మహిళల పరిచయాలూ ఇందులో లభిస్తాయి. పర్యావరణ రక్షణోద్యమ కారిణి వందనాశివ, అంతరిక్ష యాత్రికురాలు కల్పనాచావ్లా వంటి సాహసోపేతమైన ఇటీవలి మహిళల నుంచి, ఆనాటి ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దేవికారాణి, షంషాద్భోగం వరకూ ఉన్నారు.