
PRAJA NAYAKUDU V.SUBBAIAH
by A.AMARAIAH
₹60
In stock · 293 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కామ్రేడ్ వి. యస్. అమర్ హై పుదుచ్చేరి తలైవర్ కామ్రేడ్ వి. సుబ్బయ్య గురించి వినడమే తప్పు, ప్రత్యక్షంగా చూడలేదు. అయితే సిపిఐ 22వ జాతీయ మహాసభ పాండిచ్చేరిలో 2015 మార్చి 25-29 తేదీల్లో జరిగిన సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. పాండిచ్చేరి అతి చిన్న రాష్ట్రం. కేవలం 2300 మంది పార్టీ సభ్యులున్న రాష్ట్ర పార్టీకి: జాతీయ మహసభ నిర్వహించడం సాధ్యమా? ఊహకందని నిర్ణయం జాతీయ సమితి చేసింది. దీన్ని జయప్రదం చేయడానికి ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను సాయం చేయమని కేంద్ర పార్టీ ఆదేశించింది. పాండిచ్చేరిలో ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘంలో నన్ను కూడా ఒక సభ్యునిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మహాసభల సన్నాహం కొరకు వెళ్ళి రాష్ట్ర పార్టీ నాయకులతో తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా కామ్రేడ్ వి. యస్. పేరు ప్రస్తావనకు రావడమే గాదు. వారిని ఒక దైవంగా పరిగణించి మాట్లాడేవారు. అక్కడ చందాలు, ఇక్కడలాగా లక్షలకు లక్షలు ఇచ్చే స్తోమత ఉన్న వారు లేరు. అయినా మహాసభ జరిపిన తీరు చూస్తే, బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మహాసభల నిర్వహణకు ఏ మాత్రం తీసిపోలేదు. భోజన సౌకర్యాలు, వసతి, వలంటీర్ల సర్వీసు, బహిరంగ సభకు ఏర్పాట్లలో అధునాతన విధానం పాటింపు, యావత్ సిపిఐ ప్రతినిధులను ఆశ్చర్యపరచింది. ఈ విజయం వెనుక కామ్రేడ్ వి. సుబ్బయ్య స్ఫూర్తి నీడలాగా పాండిచ్చేరి పార్టీని వెంటబెట్టుకుని ఉన్నది. అదే వారి విజయ రహస్యం. కమ్యూనిస్టు ఐక్యతపై కామ్రేడ్ వి. యస్. అకుంఠిత అంకిత భావం వారి జీవిత చరమాంకం వరకు పని చేసింది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక వచ్చినా, పాండిచ్చేరిలో చీలిక రానివ్వలేదు. తమిళనాడులో కళ్యాణ సుందరం లాంటి దిగ్గజం సిపిఐని కొంత చీల్చగలిగారు. కానీ పాండిచ్చేరిలో ఆ పని జరగలేదు. దానికి కారణం వి. సుబ్బయ్య అంకిత భావం. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా ఉండాలన్నదే ఆయన దృఢ కాంక్ష. అదే ఇప్పటి కమ్యూనిస్టులకు ఆదర్శం కావాలి.