
PRAJA PORATALA RANGASTALAM ANDHRA PRAJANATYANA MANDALI
by DR.MIKKILINENI RADHA KRISHNA MURTY
₹125
In stock · 131 available
PublisherRENUKA PRACHURANALU
LanguageTelugu
నా జీవితాన్వేషణలో ప్రజానాట్యమండలి అలా అని అమ్మ చెప్పింది ఆ ఊరు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నానికి కృష్ణ అవతల ఒడ్డునున్న రాయపాలెం. అతిచిన్న గ్రామం. అది మా అమ్మ మేనమామ గారి ఊరు. అసలు మా అమ్ము పుట్టిల్లు కృష్ణాజిల్లా గన్నవరం దగ్గరలోని పెదఅవుటపల్లి. మా అమ్మమ్మ చనిపోవటంవల్ల మా అమ్మను కాన్పుకు మేనమామ ఇంటికి లింగాయిపాలెం తీసుకువచ్చారట. అది 1916 సంవత్సరం. కృష్ణాష్టమి, గాడాంధకారం. ఒక ప్రక్కన ఉరుములు మొరుపులతో బ్రహ్మాండమైన గాలీ, వర్షం, మరో ప్రక్క కరకట్టలేని కృష్ణానది పరవళ్ళు తొక్కుతూ పొంగిపొర్లుతూ వుంది. ప్రక్కనున్న ఊళ్ళన్నిటినీ ముంచివేసింది. ఆ భయంకర వాతావరణంలో అమ్మ నన్ను కన్నది. క్రమేపీ వరద నీరు అమ్మ మోకాటి లోతు వచ్చేసి మంచాన్ని తాకాయి. అమ్మను భోషాణం మీదికి మార్చి, ఓ గుద్ద ఉయ్యాల కట్టి అందులో " పడుకోపెట్టి ఉయ్యాలను దూలానికి వ్రేలాడతీశారట. మొగిలిన వాళ్ళు గడమంచి మీద ఎక్కి కూర్చున్నారట. ఆ మరునాడు వంట లేదు. దొడ్లో వున్న గోవులు చనిపోయాయట. గోకులాష్టమినాడు పుట్టాను కనుక, గోవులన్నీ పోయాయన్నారట. అష్టమినాడు పుట్టటంనల నాకున్న ఒకే ఒక మేనమామకు కీడన్నారట. బ్రతికుంటే ఇంకా అరిష్టమనుకున్నారట. మా అమ్మ మేనమామ తల్లి నా గొంతులో వడ్లగింజ వేసి నన్ను చంపివేయాలనుకుందట ? ఆ విషయాన్ని గమనించిన మా అమ్మ మేనమామ భార్య లక్ష్మమ్మ అడ్డుకుందట. నాలుగు రోజులకు కాని వరదనీరు తగ్గలేదట. కలావుగాని కృషి కృష్ణుడేనన్నారు నేను పుట్టుటయే కీడనుకున్నవాళ్ళు కృష్ణాష్టమినాడు పుట్టాను గనుక కృష్ణుడేనన్నారట. వాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టారట. అంతకు ముందే పుట్టిన మా అన్న పేరు బలరామమూర్తి. అలా అని అమ్మ బ్రతికుండగా చిన్న పిల్లల కథగా, నా జీవిత కధ చెప్పింది. పుట్టింది లింగాయపాలెం అయినా స్వగ్రామం విజయవాడ దగ్గరున్న కోలవెన్నులో పెరిగాను. నాన్న పేరు వెంకయ్య, అమ్మ పేరు సౌభాగ్యమ్మ ఇద్దరు చెల్లెళ్ళు చనిపోగా నలుగురు అన్నదమ్ములం.