
PRAJAKALA TAPASWI DR.GARIKAPATI RAJARAO
by K.SHANTARAO
₹40
In stock · 80 available
PublisherK.SHANTARAO
LanguageTelugu
డా॥ గరికపాటి రాజారావు ఆజానుబాహుడు.. ఎత్తయిన విగ్రహం.. హరికథా భాగవతార్ వేషధారణ.. సాక్షాత్తు ఆ పరమ శివుడే ప్రత్యక్షమైనట్టు దివ్యమంగళ రూపం. కంచు కంఠంతో శివస్తోత్రం.. శివదండకం.. తదనంతరం శివతాండవ నృత్యం.. ప్రక్కన వాయులీన మృదంగ వాద్యనాదాలతోపాటు పూరించిన శంఖం.. ఆంగికం భువనం యశ్య అన్న రీతిలో ఆ దేహం బ్రహ్మాండాన్ని ఆక్రమించిన తీరు. ఆ దృశ్యంతో మమేకమైన పదేళ్ల బాలుడు రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు. ఊగిపోతున్నాడు. సంగీత తాళగతులకు అనుగుణంగా మోకాళ్లపై చేతి వేళ్లను ఆడిస్తున్నాడు. తన చేతిలో ఏ వాద్య పరికరం లేకపోయినా శ్రద్ధగా మృదంగాన్ని వాయిస్తున్నట్టే తాళం వేస్తున్నాడు. పద్మాసనంపై నిటారుగా కూర్చున్న ఆ బాలుని శరీరం తన్మయత్వంతో లయాన్వితంగా ఊగిపోతున్నది. కథ చెప్తున్న భాగవతార్ దృష్టి ఆ పిల్లవానిపై పడింది. బాల మార్కండేయ తేజస్సుతో కాంతులీనుతూ ప్రతిబింబిస్తున్న ఆ బాలుని అభినయం భాగవతార్ ను అమితంగా ఆకర్షించింది. స్పందన.. స్పందన నుండి ప్రతిస్పందన.. ప్రతిస్పందన నుండి మరలా తిరిగి స్పందన. ఏకకాలంలో ఉద్భవించే జీవకళ సృష్టి బంధం అది. నటరాజైన పరమశివునికి, ప్రేక్షక భక్తునికి మధ్యన సాగే పరమోత్కృష్టమైన పవిత్ర బంధమేదో వారిరువురి మధ్యన పెనవేసుకుపోయింది. కథానంతరం భాగవతార్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకుని వాత్సల్యంతో ముద్దాడాడు. భేష్! వృద్ధిలోకి వస్తావు. కష్టములెన్ని ఎదురైనా కళామతల్లిని విడనాడవద్దు అని ఆశీర్వదించి నిష్క్రమించాడు. బాలుని హృదయం పూజ్యభావంతో నిండిపోయింది. ఆ భాగవతారే హరికథా పితామహుడు.. ఆదిభట్ల నారాయణ దాసుగారు.. ఆ బాలుడే ప్రజా కళాతపస్వి డా॥ గరికపాటి రాజారావు,