PRAJAKETHANAM GEYA SAMPUTI by RACHA BHOOMAIAH Telugu book cover

PRAJAKETHANAM GEYA SAMPUTI

by RACHA BHOOMAIAH

₹45
In stock · 12 available
PublisherRACHA BHOOMAIAH
LanguageTelugu
నామాట మాటల అల్లికనే ఓపాట లక్ష్యసాధనకది రాచబాట మనిషి జీవన విధానంలో బాధ్యత అనేది ప్రథమమైనది. జన్మతోనే బాధ్యత ముడిపడివున్నది. సామాజిక జీవన విధానంలో ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికపరంగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిండు అనేదికాదు ముఖ్యం. నా ఈ ఎదుగుదలకు కారకులెవరు? వారికి తిరిగి నేను బాధ్యతాయుతంగా ఏదైనా న్యాయం చేస్తున్నానా! లేదా! అని బేరీజు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సర్వసంపదలకు సృష్టికర్తలైన శ్రమజీవులపై ఏపని చేయనివాడు పెత్తనం చలాయించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. శ్రమ ఒకడిదైతే ఫలితం మరొకడిది అవుతుంది. అయినా శ్రమించడం ఆగిపోలేదు. కష్టంతోనే సుఖం ముడిపడివున్నట్టు పనికి పాటకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉన్నది. ఆరెంటిని వేరువేరుగా చూడలేము. పనిచేస్తూ అలసిపోతున్న శరీరానికి పాట శక్తినిచ్చే ఊపిరి అవుతుంది. పాటపాడుతూ పనిచేస్తున్నప్పుడు అలసటనుంచి ఉపశమనం పొందే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాలలో కొంతవరదాక ఆకలినికూడ ఆపుకొనగలము. ఉదా: చంటిబిడ్డ ఆకలై పాలకోసం ఏడ్చినప్పుడు తల్లి ఇలా అంటుంది. లో లో లో లో.... ఆయి.... రావె రావె పిట్ట రావెపిట్ట పండుదెచ్చి మా చిట్టినోటిలో పెట్ట.... ఆయి.... అంటూ బిడ్డ చెవిదగ్గర నోరుపెట్టి తల్లిగాని, తండ్రిగాని ఇలా పాడినప్పుడు ఆ ధ్వనిని వింటు ఆబిడ్డ అలాగే నిద్రపోయిన నిజాలు చాలావరకు చూస్తున్నాము. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈమూడు మౌళిక సూత్రాలు నన్నెంతో ప్రేరేపించినవి. ఈ భూమిమీద మొదట మనిషిగా పుట్టినం కాబట్టి ముందుదానికే ప్రాధాన్యతనివ్వాలి. అటుతర్వాతనే కులం, మతం, వర్గం, పేద, ధనిక, రాజు, సామాన్యుడు, అధికారి, సేవకుడు ఇలాంటివి జీవన విధానంలో ఎన్నైనా ఉండనీ, అవన్నీ మనిషి తర్వాతనే. కాని ఇప్పుడు అవన్నీ కలుషితమై మాయమైపోతున్నవి.