
PRAJALA MANISHI TELANGANA THOLI NAVALA - 150.00
₹150
In stock · 825 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నవలలో మాట్లాడే క నవల పూర్వం లుదేరిన ఇతివృత్తం, విధంగా చాలా ఉంచాను. జాత్తు ఒక లను విన్న కేవలం పుచ్చడం చింది. ఆ మిత్రుల ద్దామే ఈ * బయటికి హార్దిక తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది. ప్రజలు ఇండ్లలో నుండి బయటికివచ్చి తమ దైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు. రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి వీధిలో ఎత్తైన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండుగడ్డి వేశారు. బాటనబోయే ఒక ఆవు గడ్డిలో మూతి పెట్టబోయింది. తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది. చేతికర్రతో ఎండుగడ్డిని కిందు మీదు చేస్తున్న కోటయ్య పరీక్షగా తన ఎద్దును మాచాడు. అందరికి సంబంధించినదిగా తలచబడే వస్తువును ఇతరులు హరించబోతుంటే అడ్డుపడి రక్షించుకొనే ఆలోచన తన ఎద్దుకు కలిగినందుకు మానవుని ప్రవృత్తి తన ఎద్దుకు అలవడినందుకు ఆనందిస్తూ కోటయ్య కొట్టములోకి నెక్కాడు. కొట్టములో గుంజకు కట్టివేసియున్న ఆవును దీనంగా చూస్తూ కోటయ్య కొడుకు కొమరయ్య నిలబడ్డాడు. ఆ ఆవు తొక్కుతున్న కాళ్ళవద్ద పేడ తీయటానికి అతనికి మనసొప్పటం లేదు. ఆవుదూడ అంబే అని అరిచింది. కోటయ్య కండ్ల వెంట నీరు కారింది. తండ్రిని చూడగానే కండ్లలో నీరును ప్రయత్న పూర్వకంగా ఇంకించుకొన ప్రయత్నం చేస్తూ, “దీనికి చొప్పవేయల్నా అయ్యా?" అన్నాడు. తండ్రి అనంగీకార సూచకంగా కొమరయ్యను చూచి కొట్టంలో ఈతనార కట్టను పరీక్షిస్తున్నాడు. "ఇక రోజూ మేపంగద అయ్యా! ఇయాల ఒక రోజేగద! కడుపు నిండ మేపుదాం." కొమరయ్య సందిగ్ధ ధోరణిలో అన్నాడు. "ఇయ్యాళ్ళంతా అది ఉండబోతుందా? ఇప్పుడో ఇంకాసేపటికి సుంకరి పుల్లయ్య రానేవస్తాడు" అంటూ కోటయ్య విసుగుతో ఇంట్లోకి వెళ్ళాడు. ఆవును దక్కించుకునే ఆలోచనేమన్నా ఉందేమో అడుగుదామని తండ్రి వెంబడే పోయాడు కొమరయ్య. "ఇక మనకు ఆవు దక్కడా అయ్యా?” కొమరయ్య గంభీరంగా అడిగాడు. "నీ కెందుకురా ఈ తిప్పలంతా? కన్నబిడ్డనే ఇంకో అయ్యకిచ్చి రోజులు నడవటంలేదు? ఇక గొడ్డుకొచ్చింది" అన్నాడు కోటయ్య.