PRAKRUTHI SAHAJAMAINA - AIYASKANTHA CHIKISTA by SRI VASAVYA Telugu book cover

PRAKRUTHI SAHAJAMAINA - AIYASKANTHA CHIKISTA

by SRI VASAVYA

₹70
In stock · 23 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
అయిస్కాంత చికిత్స విధానం 'ఆరోగ్యమే మహాభాగ్యం' - అనాది నుంచి వినవస్తున్న నానుడి. 'ఆరోగ్యమే జీవితం' అన్న మాట నిత్యసత్యం. ఆరోగ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా పరిపూర్ణ జీవితం అనుభవించలేము. ఆరోగ్యంతో జీవించడమే అసలు సిసలైన జీవితానికి సంపూర్ణ రూపం కాగలదు. శారీరక ఆరోగ్యంలో ఏ కొద్దిలోపం వున్నప్పటికీ మానసిక ఆరోగ్యం మీద ప్రతిఫలిస్తుంది. నడుస్తున్న జీవితానికి హద్దులు ఏర్పడతాయి. ఆటంకాలు ఎదురవుతాయి. నిస్సత్తువగా, జీవచ్ఛవం వలె జీవితం గడపాలని ఎవరూ కలలో కూడా కోరుకోరు. ప్రతి చిన్న రుగ్మతకు, తాత్కాలికంగా తలనొప్పి రాగానే టాబ్లెట్లు మింగడం, కొంచెం నలతగా ఫీలయితే రెండురకాల క్యాప్యుల్స్ దిగమింగడం, ఇంకా అవసరమని అపోహ కలిగితే సూదిమందు (ఇంజెక్షన్) వేయించుకోవడం ఇలా చికిత్సలు పొందడం సర్వసాధారణమై పోయిందీనాడు. ఏ వైద్య విధానం ఎంతటి పురోగతి సాధించినా, సాంకేతికప్రగతికి ఎదిగినా శరీరాన్ని ఔషధాల ప్రయోగాలశాలగా మార్చడం సబబుకాదన్న సంగతి అన్ని విధానాలూ అంగీకరించేవే. ఏదో చిన్న నలతను నివారించుకునేందుకు ఎన్నెన్నో అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ను, మరెన్నో ఎలర్జీలను ఆహ్వానించువారు ఎంతోమంది అనునిత్యమూ మనకు తారసపడుతూనే వుంటారు.