
PRAKRUTHI VIGNANAM - 100
₹100
In stock · 557 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. నీటి మీద నడిచే జీవాలు సరస్సులు, నదులను చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అందాలకు ఆకర్షితులు కాని మనుషులుండరు. నిలిచి ఉన్న నీటిపై కొన్ని జీవాలు ఎంతో సునాయాసంగా నడుస్తూ ఉంటాయి. ఇలాంటి జీవాల సంఖ్య ఎంతో అల్పమని చెప్పుకోవచ్చు. మనిషి చాలా కాలంగా ఇలాంటి జీవాల్ని విశ్లేషించి, వాటిలోని రహస్యాల్ని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు, నీటి మీద నడిచే సాలె పురుగులు, జీనస్ స్నేనస్, బాసిలిస్క్ బల్లులను చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. జీవ, ద్రవగతిక శాస్త్రవేత్తల ఉమ్మడి పరిశోధనలు ఈ జీవులు పైన జరిగింది. ఈ పరిశోధనలు ఎంతో ఆసక్తి కరమైన విషయాల్ని వెల్లడించాయి. ఈ ప్రత్యేక శక్తి వాటికి ఏవిధంగా వచ్చిందో శాస్త్రజ్ఞులకు ఇంత వరకు అంతుబట్టలేదు. ఇటీవల నీటిపై ఎగిరే విమానాల్ని శాస్త్రవేత్తలు తన క్రీడాంగణాలుగా చేసుకొని రెండింటా సంచరించగల సాధనాన్ని ఆవిష్కరించారు. నీటి అలలపై తేలియాడుతూ, రెక్కలు విప్పుకొని నీటి ఉపరితలాన్ని విడిచి ఎత్తులో తేలిపోయే విమానాన్ని ఆస్ట్రేలియా వారు తయారు చేశారు. నీటిలో ఈదటం ఎన్నో జీవాలకు సాధ్యమైంది. కానీ, నీటి మీద నడక సాగించడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. పురాణాల్లో, కథల్లో మనం, మనిషి గాలిలో ఎగిరాడని విన్నాం. అవి కథలు గాబట్టి సరిపోయాయి. కానీ, నిజ జీవితంలో నీటిపై నడక సాగించడాన్ని వివరించాలంటే ఎంతో శాస్త్ర వివరణ అవసరం. తడి ఏమాత్రం అంటుకోని నిర్మాణం కలిగిన పాదాలు, నీటిలోని తలతన్యత బలం, ఆ జీవాల బలాల్ని