PRAPANCHA VIJETALU - 7 VYAKTHITVA NIRMANAM by DR.KATTI PADMARAO Telugu book cover

PRAPANCHA VIJETALU - 7 VYAKTHITVA NIRMANAM

by DR.KATTI PADMARAO

₹500
In stock · 3 available
PublisherLOKAYATA PRACHURANALU
LanguageTelugu
Dr. Kathi Padmarao 'ప్రపంచ విజేతలు వ్యక్తిత్వనిర్మాణం' అనే శీర్షికతో డా॥ కత్తి పద్మారావు గారు ఇప్పటికి ఆరు గ్రంథాలు వ్రాశారు. ఇది ఏడవ గ్రంథము. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, జాతివైతాళికుల జీవన గాథలను, సిద్ధాంతాలను గూర్చి చర్చిస్తూ వారిలో వుండే ప్రతిభల్ని వారు విజేతలుగా నిలిచిన విధానాలను వారి జీవన క్రమాన్ని ఈ తరాలకు, రాబోయే తరాలకు అందించే ప్రయత్నాన్ని ఈ గ్రంథాలలో చిత్రించారు. ఈ క్రమంలో వచ్చిన మొదటి గ్రంథంలో షేక్స్ పియర్, చార్లీచాప్లిన్, కార్ల్్మమలను, రెండవ గ్రంథంలో డా॥ బి.ఆర్. అంబేద్కర్, బెర్ట్రాండ్ రస్సెల్, విలియం వర్డ్స్ వర్త్ ను మూడవ గ్రంధంలో డార్విన్, బుద్ధుడు, అంబేద్కర్లను, నాల్గవ గ్రంథంలో అల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సైమన్ డిబిరో, నెల్లీసాచ్, ఫెడరల్ కాస్ట్రోలను ఐదవ గ్రంథములో మహాత్మాపూలే, అంబేద్కర్, పెరియార్, కబీర్, బేకన్, బెర్ట్రాండ్ రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, బాలగంగాధర్ తిలక్, శరత్ చంద్ర ఛటర్జీలను, ఆరవ గ్రంథములో కార్ల్ మార్క్స్, రవీంద్రనాధ్ ఠాగూర్, ఖలీల్ జిబ్రాన్, జేమ్స్ ఆలిసన్, నర్గీస్ లను ఈ 7వ గ్రంథంలో ఇమ్మానుయేల్ కాంట్, పిరాండెల్లో, సర్ ఆర్థర్కాటన్, సంజీవదేవ్, ఎలిస్ వెలింగ్టన్ గోలిన్స్, తాపీ ధర్మారావు, గుడిపాటి వెంకట చలం ఇంకా ఎందరో గొప్ప వ్యక్తులను వారి వ్యక్తిత్వాలను వారి మానసిక ఔన్నత్యాన్ని వారి పోరాటశక్తిని వ్యక్తిత్వ నిర్మాణ దృష్టితో వర్ణించటం జరిగింది. మహాకవి డా॥ కత్తి పద్మారావు గారి రచనలను ఆదరించి పఠిస్తున్నందుకు పాఠకలోకానికి కృతజ్ఞతలు. ఈ గ్రంథాన్ని కూడా మీ కరదీపికగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. లోకాయత పబ్లికేషన్స్