PRASNA YENDUKU - 120 by PEDDI SAMBASIVARAO Telugu book cover

PRASNA YENDUKU - 120

by PEDDI SAMBASIVARAO

₹120
In stock · 198 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400002
PRASNA ENDUKU? English: Ted Agon, Heuston Telugu Translation: Dr. P. Hari Padma Rani, Peddi Sambasiva Rao ఆంగ్లంలో టెడ్ అగాన్ రచించిన 'ది హ్యూమన్ కీ' పుస్తకానికి తెలుగు అనువాదం 'ప్రశ్న ఎందుకు?' * జీవితంలో, విద్యావ్యవస్థలో ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? * ప్రశ్నించే తత్వాన్ని పిల్లలకు ఎప్పుడు, ఎలా నేర్పాలి? * ప్రశ్న జీవన నైపుణ్యాలన్నిటిలో ఎలా అనుసంధానమై ఉంటుంది? సమాధానాలు కావాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. “ప్రశ్న - ప్రగతికి మూలం” “వేలవేల ప్రశ్నలు వేయనిద్దాం - అందరినీ ఎదగనిద్దాం”. ఈ స్వేచ్ఛానువాదం కొత్తరుచినీ, వాసననీ పొదివి పట్టుకుని ఆగకుండా చదివిస్తుంది. అందులో భావజాలానికి అబ్బురపడేలా చేస్తుంది. ప్రశ్నించడం భారత ఇతిహాసాలతో, పురాణాలలో ఆదినుంచీ ఉన్న ప్రక్రియే. నిజానికి “నేను ఎవరు?” అని ప్రశ్నిస్తూ, ప్రశ్న వేసుకుంటూ ఆదిశంకరుల వారి నుంచి వివేకానందులవారి దాకా శోధించినదే మన వేదాంతసారం. పాశ్చాత్య నాగరికతలో ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు ప్రశ్నించాలి అనేది ఒక మౌలిక సూత్రం - పాశ్చాత్య దేశాలలో పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం ఇంకా ఇంకా పెరగాలనేది ఈ గ్రంథ ప్రధాన ఉద్దేశం. - వంగూరి చిట్టెన్ రాజు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, USA విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-00-2