PRASNALE SAMSDHANALU - QUESTIONS ARE THE ANSWERS - 199.00 by ALLAN PEASE Telugu book cover

PRASNALE SAMSDHANALU - QUESTIONS ARE THE ANSWERS - 199.00

by ALLAN PEASE

₹199
In stock · 2 available
PublisherMANJUL PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788183222372
సహజంగానే కొందరు ఈ విభాగం ఆరంభంలోని చిత్రాన్ని, అది సూచించే సందేశాన్నీ గమనించి ఉంటారు. అంతగా విషయం తెలియనివారికి అవేవో సంబంధంలేని పిచ్చి గీతల్లాగా అర్థంపర్థం లేనట్లుగా అనిపించవచ్చు. కానీ ఆ గీతల మధ్య ఉన్నదాన్ని ఎలా చదవాలన్నది నేర్చుకున్నప్పుడు ఆ సమాధానాన్ని తెలుసుకోడానికి మీ దృక్కోణాన్ని సర్దుబాటు చేసుకోవలసిన అవసరం ఉందని మీరు గ్రహిస్తారు. ఈ పుస్తకం ద్వారా మీకు మేం నేర్పించే విషయం కూడా సరిగ్గా అదే! (ఈ పేజీని దిగువగా మీకు దూరంగా ఉంచి, ఒక కన్ను మూసి చూడండి.) విజయానికి ఐదు బంగారు సూత్రాలు నేను పదకొండేళ్ల పిన్నవయసులో ఇంట్లో ఉపయోగించే స్పాంజి వస్తువుల్ని అమ్మవలసివచ్చింది. అది మా స్కౌట్ జట్టుకోసం నిర్మించే హాల్ కట్టడానికి అవసరమయ్యే నిధులకోసం! మాకు పెద్దాయన, మంచి తెలివైన మా స్కౌట్ మేస్టారు ఆ సందర్భంగా నాకో రహస్యం చెప్పారు. దాన్ని నేను 'పరిణామసూత్రం' అంటాను. నేను ఈ సూత్రాన్ని అనుసరించే జీవనయాత్ర కొనసాగించాను. దీన్ని ఆచరణలో పెట్టేవారు కాలక్రమేణా తప్పక విజయం సాధిస్తారని నేను హామీ ఇస్తున్నాను. నేనీ సూత్రాన్ని ఎలా స్వీకరించానో మీకు అలాగే మనవి చేస్తాను - "విజయమనేది ఒక ఆట. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా అడితే, అన్నిసార్లు ఎక్కువగా గెలుస్తావు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా గెలిస్తే, అన్నిసార్లు ఎక్కువ విజయవంతంగా ఆడగలుగుతావు." ఈ సూత్రాన్ని నెట్వర్కింగ్కు కూడా వర్తింపజేద్దాం "నువ్వు ఎంత ఎక్కువ మందిని ఇందులో చేరమని అడుగుతావో, అంత ఎక్కువమంది చేరతారు. ఎన్నిసార్లు వాళ్లను చేరమని అడుగుతావో, అంతగా నువ్వు అడగడంలో రాణించగలుగుతావు." మరోమాటలో చెప్పాలంటే, మీరు చాలామందిని ఇందులో చేరమని అడుగుతూనే ఉండాలి. సూత్రం # 1 : ఎక్కువ మందిని కలుసుకోండి ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మీ మాట ఎక్కువసేపు వినేవాళ్లు ఎవరున్నాసరే వారితో మాట్లాడండి. పెద్ద పేరు హోదా వంటివి ఆశించే పెద్దమనిషిగానో లేక కార్డ్ షప్లర్ (పేకముక్కలు కలిపే వ్యక్తి) గానో అవ్వాలని