
PRATHAMA JAATHIYA SWATANTRA SAMARAM 1857
₹60
In stock · 303 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవాలయాలకు క్రైస్తవ ధర్మకర్తలు "హిందూ దేశంలో మన ఆధీనంలో వున్న రాజ్యాలలో వుండే వివిధ మతముల వారిపట్ల సంపూర్ణమైన సహనము చూపడము, ఆయా మతముల వారి ఆధార వ్యవహారములకు ఏలాంటి యిబ్బందిన్నీ కలగకుండా వారిని సంరక్షించడమూ, వాటితో మనము స్వయముగా ఏలాంటి జోక్యమూ కలిగించుకోకుండా వుండడమేగాక, ఇతరులు కూడా వారి కేలాంటి యిబ్బందీ కలిగించకుండా కనిపెట్టి వుండడమూ, మొదటి నుండిన్నీ మన పరిపాలనలో మనం అవలంబిస్తూ వచ్చిన పద్ధతి అని అందరికీ తెలుసును" అని తూర్పు ఇండియా కంపెనీ డైరక్టరుల సభవారు చెన్నపట్నం సెంట్ జార్జికోట అధికారులకు 1807వ సంవత్సరము మే నెల 29వ తేదీన ఒక వుత్తరంలో వ్రాశారు. (Political History of India by Sir John Malcolm Vol II PP 267) 1781వ సం.లోను, 1793వ సం. లోను, 1833వ సం.లోను పార్లమెంటువారు జాసించిన చట్టాలలో కూడా ఈ రాజనీతి సూత్రాన్ని స్పష్టంగా వుదాహరించారు. వంగరాష్ట్రంలో 1810వ సంవత్సరంలో శాసింపబడిన ఒక రెగ్యులేషను అనే చట్టాన్ని బట్టిన్నీ, 1817వ సం.లో చెన్నపట్నంలో శాసింపబడిన చట్టాన్ని బట్టిన్నీ హిందువుల దేవాలయాలకు, తురకల మసీదులకు పూర్వులిచ్చిన మాన్యాలను, దేవాదాయాలను, ధర్మాదాయాలను కుంపినీ వారు స్వయంగా పరిపాలించడానికి పూనుకున్నారు. ఈ ధర్మ కార్యాలను ప్రతి జిల్లాలోనూ, ఆ జిల్లా కలెక్టరే సక్రమంగా నిర్వహించేటట్లు నిర్ణయించారు. ఈ కలెక్టర్లపైన రివిన్యూ బోర్డువారు పై తనిఖీ చేస్తూ వుండేటట్లుగా కట్టుదిట్టము చేశారు. దేవాలయాల భూములను కలెక్టరులు అమరకపరచి జిల్లా రివిన్యూ శిస్తులతో పాటుగా దేవాదాయాన్ని కూడా తాశీల్దారుల ద్వారా వసూలు చేయించేవారు. దేవాలయాల నిత్యకృత్యములను గురించి కలెక్టరులు తాకీదులుజారీచేస్తూ 'దేవుడి పనులు' జాగ్రత్తగా చెయ్యాలని కింది వుద్యోగులను, నౌకరులను హెచ్చరించేవారు. కుంపినీ సర్కారు వారు దేవాలయాలను, మశీదులను మరమ్మతు చేయించి కొత్త వాటిని కట్టించేవారు. అక్కడి -నిత్య నైవేద్య ధూపదీపాలు, అర్చనలు కలెక్టర్ల ద్వారా సక్రమంగా జరిపించేవారు. విగ్రహాలకు అలంకారాలు చేయించడము, దేవుడి పెళ్ళి చేయించడము, దేవదాసీలను నియమించడము, భోగము మేళములతో ఊరేగింపులు చేయించడము క్రైస్తవులైన కలెక్టర్లు స్వయంగా దగ్గరవుండి చేయించేవారు. ఈ కలెక్టర్లు తమ దొర టోపీలను తీసి విగ్రహాలకు గౌరవం చూపుతూ కుంఫినీ వారి తరఫున బట్టలు సమర్పించి జోహారులు చేసేవారు. కుంపినీ సైనికులు బారులుతీర్చి నిలువబడి గౌరవం చూపించేవారు. ప్రతియేటా వేలకొద్ది జనంచేత దేవుడి రథాన్ని లాగించేవారు. వర్షాలు కురవకపోతే వానదేవుడికి పూజలు చేయించడానికి ఉర్కారు ఖజానాలో నుంచి సొమ్ము యిచ్చేవారు.