PRATHIBIMBAALU - KAVITHA SAMPUTI by K.TEJASWINI Telugu book cover

PRATHIBIMBAALU - KAVITHA SAMPUTI

by K.TEJASWINI

₹80
In stock · 237 available
PublisherK.TEJASWINI
LanguageTelugu
ISBN9789391400354
త్రాగ గుక్కెడు నీళ్ళు దొరకక, శ్రీనాథ కవిసార్వభౌముడు, “తిరిపెమున కిద్దరాండ్రా, పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్" అని . "As flies to wanton boys are we to the gods. They kill us for their sport ( కుర్రాళ్ళ చేతిలో క్రిమికీటకాల విలువెంతో దేవుళ్ళ దృష్టిలో మన విలువంతే సుమా. కాలక్షేపం కోసం దేవుళ్ళు మనుజుల వేటాడుతారు.) అని షేక్స్పియర్ విశ్లేషించె. "సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకమూ రామచంద్రా! / ఆ పతకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా! / కలికితురాయి నీకూ పోలుపుగా జేయిస్తిని రామచంద్రా! / నీ తండ్రి దశరథ మహరాజు పంపెనా! / లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా!" అని తానీషా దెబ్బలకు తాళలేక గోపన్న వాపోయె. "క్యూ గర్దిష్-ఎ-ముదాం సే గబ్రా న జాయే దిల్ / ఇన్సాన్ హూం ప్యాలా-ఓ-సగర్ నహిన్ హూం మై" (కాల గమనానికి నా హృదయం ఎందుకు తల్లడిల్లకూడదు / మట్టి మనిషిని నేను, మధుపాత్రను కాను) అని మీర్జా గాలిబ్ సైతం తన మనసులోని దుఃఖాన్ని వెళ్ళగక్కె, చెప్పొచ్చేదేమిటంటే, బాధపడిన తక్షణం, భాష, ప్రాంత, లింగ, కాల భేదాలకతీతంగా మనిషి దేవుడ్ని తలుస్తాడు, దూషిస్తాడు, కాళ్ళబేరానికి వస్తాడు, చివరికి వైరాగిగా రూపొందుతాడు. ఈ మార్పులు మనసున్న ప్రతి జీవికి సహజం. మనసుని ప్రతిబింబించే రచన మాత్రం కవి సొంతం.