
PRATHIGHATANA KATHALU
₹80
In stock · 324 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. ప్రతిఘటన ఆ ఊరి పేరు నూకలపల్లి అదొక కుగ్రామం....... నాగరికతకి దూరంగా, ప్రభుత్వంవారి అభివృద్ధి పథకాలకి నోచుకోకుండా, ఎంతో వెనకబడి వున్న ప్రాంతం అది. మన రాష్ట్ర పటంలోనే కాదు జిల్లా 'మేప్'లోనే నూకలపల్లి చిరునామా కన్పించదు. సరైన రవాణా సౌకర్యం లేదు. గౌరిదేవిపేట దగ్గర బస్సు దిగి, అడవి దారి గుండా ఐదు మైళ్ళు నడిస్తే గాని నూకలపల్లి చేరుకోలేం. రామిరెడ్డి......... ఆ వూరికి పెద్ద తలకాయ. అతని మాట శిలాశాసనం. ఆ వూరి ప్రజలందరికీ ఆయన తీర్పు శిరోధార్యం. ఆ రోజు నూకలపల్లికి ఎవరైనా జనాభా లెక్కల సేకరణ పని మీద వచ్చినట్లయితే, వారి పని సులభమవుతుంది. యిల్లిల్లూ తిరిగి, వివరాలు రాసుకునే శ్రమ లేకుండా 'ఒకచోట' కూర్చుని, ఆ వూళ్ళో నివసిస్తున్న తలల్ని లెక్కించుకోవచ్చు 'ఆ చోటు' రామిరెడ్డి నివాసం. ఆ వూరు మొత్తానికి ఆయన్దే పెద్దిల్లు. ఇంటిముందు ఎత్తయిన అరుగులున్నాయి. వాటిమీద కుర్చీలు వేసి వున్నాయి. రామిరెడ్డితో పాటు...... పెద్ద మనుషులనబడే మరికొందరు వ్యక్తులు ఆ కుర్చీలల్లో ఆసీనులయి వున్నారు. విశాలమైన ఖాళీ జాగా ఆ ఊరి జనంతో నిండి వుందా రోజు. కొందరు పిల్లలు చెట్ల కొమ్మల మీదకెక్కి కూర్చున్నారు. మరికొందరు గోడల మీద కెక్కారు. అందర్లోను ఉత్కంఠ. రామిరెడ్డి విలాసంగా మీసం దువ్వి, తన పక్క కుర్చీలో కూచుని వున్న వ్యక్తిని పరికించి చూసేడు. ఆ చూపులో మురిపెం కన్న ప్రేమ తొణికిసలాడింది. అతని పేరు పాపిరెడ్డి. కన్నవాళ్ళు పెట్టిన పేరుని సార్ధకం చేసుకోడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. గుంపులో వున్న పడుచు పిల్లల్ని మహాకసిగా చూస్తున్న పాపిరెడ్డి నెమ్మదిగా అవధానుల సుధాకర రావు