
PREMANTE SULUVU KAADURA
by SREE MADHULATHA PUBLICATIONS
₹80
In stock · 14 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ప్రేమతో ఒక చిన్నమాట..! ప్రియమైన పాఠకులకు ప్రేమ పూర్వక నమస్సులు..! ప్రేమ..! అదెప్పుడు ఎవరి హృదయాన్ని సృశిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ బంధాన పలకరిస్తుందో అంతకన్నా తెలియదు. పిలువని అతిథిలాగ పరిగెత్తుకొచ్చి, సంతోషపు కల్లోలాన్ని సృష్టించి, వచ్చినంత వేగంగా మరోచోటకి పరిగెత్తుకెళ్తుంది. అది వెళ్ళి పోయినా మనసుల్లో మనుషుల్లో తిష్ఠవేస్తుంది. అప్పట్నుంచి మొదలవుతాయి కష్టమో సుఖమో తెలియని అవస్థలు. ప్రేమించడంలోని మధురమ స్వర్గాన్ని చూపిస్తే, ఆ ప్రేమను ఎదుర్కోవడానికి పడవల్సిన కష్టాలు... ఎక్కడో వున్న నరకాన్ని కళ్ళముందు నిలబెడతాయి. ఫ్యాషన్ ప్రేమ మోజులో పడి ఈ మధ్య అందరూ 'కుచ్ కుచ్ హోతా హై' అంటున్నారు. వీళ్ళకి ఏమైందబ్బా..! అని ఆరాతీస్తే 'లవేరియా' అనే వ్యాధి సోకిందట. ఈ వ్యాధి పట్టుకుంటే వదిలేదికాదు. ఇది సోకిన వారు నిద్రాహారాలు మరచి మైరచి పోతుంటారు. జనించే ప్రతీ పదంలో జ్వలించే ప్రతీగుండెలో ఆనందాలను ఆస్వాదాలను వెల్లడించే కమ్మని భావనగీతం ప్రేమ. అది ఎప్పుడెలా జనిస్తుందో అంతరాంతల్లోకి ఎలా చొచ్చుకు పోతుందో... అంతా అర్థం కాని సందిగ్ధం..! అనిర్వచనీయం అయితే వ్యక్తీకరించే తీరునుబట్టీ అది ఎదుట వ్యక్తిని కవ్విస్తుంది.. కదిలిస్తుంది... మరిపిస్తుంది... మురిపిస్తుంది. అనుబంధాలను సుదృఢం చేయడంలో ప్రేమకు ఎన్నో మార్గాలు. అవి ఖరిదైన బహుమతులు, స్టార్ హోటళ్ళ విందులే కానవసరం లేదు. భుజం మీద తలవాల్చి చెప్పుకునే గుండె ఊసులు కావచ్చు. కలిసి కట్టుగా సాధించే విజయాలు కావచ్చు. ఒకరి లంచ్ బాక్స్ ఒకరు తింటూ పొందే మధురానుభూతులే కావచ్చు. ఆఖరికి స్వచ్ఛమైన చిరునవ్వు మన ప్రేమను వ్యక్తీకరిస్తుంది. మంత్రముగ్ధమైన ప్రేమ లోతులను సృశించేందుకు నచ్చిన వారిని పరశింపజేయటంలో సరిహద్దుల హద్దులు వుండవు. సృష్టికి మూలం ప్రేమ. ప్రేమలేనిది జీవితము లేదు. రెండు హృదయాల మధ్య అంకురించిన ప్రేమ ఎంతో మధురంగా, సున్నితంగా వుండి, యువతీ యువకుల పరివర్తనకు నాంది పలుకుతోంది. స్పందించ గల మనసున్న ప్రతీ జీవి అనుభవించే అద్భుత అనుభూతి ప్రేమ. తమ మనసులోని భావాలను ప్రేమగా వ్యక్తం చేయడం నేటి యువతరానికి ఓ ఫ్యాషన్గా మారిపోయింది. ప్రేమ మనతోనే పుడుతుంది. మనతోనే అంతమౌతుంది. అయితే వ్యక్తపరిచే విధానంలోనే మార్పు. ఇతరులు ప్రేమిస్తున్నారని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని, ఆషామాషిగా ప్రేమించే వాళ్ళు ఈ ఆధునిక కాలంలో కోకొల్లలు.