PREMATHARANGALATHO JEEVANANOUKA by CHIVUKULA PURUSHOTHAM Telugu book cover

PREMATHARANGALATHO JEEVANANOUKA

by CHIVUKULA PURUSHOTHAM

₹80
In stock · 3 available
PublisherSRI MAHALAKSHMI BOOK CORPORATION
LanguageTelugu
ప్రేమ తరంగాలలో జీవన నౌకలు రాత్రి పన్నెండు గంటలైంది. ఆ రోజు పూర్ణిమ అయినందున పూర్ణ చంద్రబింబం ఆకాశంలో నట్టనడి నెత్తిని ఉండి వెన్నెలలు విరజిమ్ము తున్నది. బెజవాడ బస్సు స్టాండులో బహు పలచగా జనం ఉన్నారు. అది జనవరి మాసం కావడంవల్ల అక్కడక్కడా బల్లలమీద కూర్చున్న జనం, నిండా గుడ్డలు కప్పుకుని, తలకు పాగాను మఫ్లర్తో చుట్టుకుని వణుకుతూ, చుట్ట, బీడీ, సిగరెట్లు కాలుస్తూ, చలికి నిద్రపట్టక, అయినా అకాలమైనందున నిద్ర ముంచుకొనిరాగా తూగుతూ ఉన్నారు. సామాన్యంగా బస్సు స్టాండులో ఉండే హడావిడి ఏమీలేదు. బారుగా ఉన్న ప్లాట్ఫారాలు ఖాళీగా ఉన్నాయి. వాటిమీద లైసెన్స్ కూలీలు ఒక గుంపుగాజేరి చెత్తా చెదారం మంటవేసి చలి కాచుకుంటున్నారు. హైదరాబాద్ ప్లాట్ఫారమ్మీద ఒకే ఒక బస్సు నిలిచి ఉన్నది. అది ఒక గంటనుండి అలాగే ఉన్నది. బస్సులో జనం నిండా కప్పుకుని కునికిపాట్లు పడుతూ, దూరంగా ఆఫీసులో ఉన్న కండక్టరును, త్వరగా బయలుదేరదీయమని కేకలేస్తూ ఉన్నారు. ఆ కండక్టర్, డ్రైవర్ ఆఫీసు క్లర్కుతో టీలు తాగుతూ, బాతాఖానీ కొడుతున్నారు. అదే ఆఖరు బస్సు కావడంతో వారూ ఏమి త్వరపడడం లేదు.. మెల్ల మెల్లగా బస్సంతా పూర్తిగా నిండింది. డ్రైవర్, కండక్టర్ తాపీగా బస్సు దగ్గరకు చేరారు. కండక్టర్ సిగరెట్ ఆఖరు దమ్ములాగి, సిగరెట్ అవతల పారేసి, బస్సులోకి వచ్చాడు. తన దగ్గర ఉన్న ట్రిప్షీట్ తీసి ప్రయాణీకులనందర్నీ లెక్కించుకొని గంట కొట్టాడు. డ్రైవర్ కూడా ఆఖరి దమ్ములాగి సిగరెట్ అవతల పారేసి, బస్సెక్కి ఇంజన్ స్టార్ట్ చేశాడు.