
PREMCHAND JEEVITHAM
by PREMCHAND
₹40
In stock · 24 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రేంచంద్ జీవితం బాల్యం :ప్రేంచంద్ కాశీకి నాలుగుమైళ్ళ దూరంలో వున్న 'లహమీ' అనే గ్రామంలో, శనివారం, జులై, 1880లో జన్మించారు. తండ్రి పేరు అజాయబ్ రాయ్, తల్లిపేరు ఆనందీ దేవి. వీరు కాయస్థజాతికి చెందిన శ్రీవాత్సవ తెగవారు. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు. కాని వారిలో ఇద్దరు స్వర్గస్తులైనారు. ఒకామె మాత్రం చాలాకాలం వరకు జీవించే వుంది. ఆయన తల్లి ఆరోగ్యం మంచిది కాదు. ప్రేంచంద్కు మరో రెండు పేర్లు కూడా వున్నాయి. తండ్రి 'ధనపత్రాయ్' అనీ, పెదనాన్న 'నవాబ్రాయ్' అనీ పెట్టారు. తల్లిదండ్రులిద్దరికీ అజీర్ణవ్యాధి వుండేది. రెండు మూడు సంవత్సరాల వయస్సులో చాందా జిల్లా వెళ్ళవలసి వచ్చింది. మొదట మౌలవీ దగ్గర ఉర్దూ అభ్యసించారు. రోజూ తమ సహాధ్యాయులతో కలసి తొలవీ ఇంటికివెళ్ళి ఉర్దూ నేర్చుకొనేవారు. శారీరకంగా చాలా బలహీనంగా వున్నా, చదువులో చాలా చురుగ్గా వుండేవారు. చిన్నతనంనుండి వినోదప్రియులే. ఒకసారి పిల్లలంతా చేరి మంగలి ఆట ఆడుకుంటున్నారు. ప్రేంచంద్ కూడ ఒక పిల్లవాడికి క్షవరం చేస్తున్నారు. అప్పుడు ఆయనకు ఓ తమాషా ఆలోచన తట్టింది. చేస్తూ చేస్తూ కత్తిలాగ వుపయోగిస్తున్న వెదురు బద్దతో ఆ పిల్లవాడి చెవి కోశారు. ఆ కుర్రాడి తల్లి ముసరుసలాడుతూ ప్రేంచంద్ తల్లి దగ్గరకొచ్చింది. ఆమె గొంతు వినగానే ప్రేంచంద్ తలుపు చాటున నక్కారు. ఆయన తల్లి చూసి నాలుగు తగిలించింది. "వాళ్ళబ్బాయి చెవ్వెందుకు కోశావురా?" అంది తల్లి. "చెవ్వు కొయ్యలేదు, క్షవరం చేశాను.” "వాడి చెవ్వునుండి రక్తం కార్తుంటే క్షవరం చేశానంటా వేంరా?" “అందరూ అలాగే ఆడుకుంటున్నారు.” "ఇంకెప్పుడూ అలాంటి ఆటలాడకు.” "ఇంకెప్పుడూ ఆడను.” ఇంకొక సంఘటన - ఒకరోజు ఆయన పెదతండ్రి నార అమ్మిన డబ్బు గూట్లో పెట్టాడు. ప్రేంచంద్, అతని పెదతండ్రి కొడుకూ కలిసి అందులోనుంచి ఒక రూపాయి తీశారు. ఆయనకు ఆ రూపాయి ఎలా ఖర్చు చేయాలో తోచలేదు. ఆయన పెదతండ్రి కొడుకు అందులో ముప్పావలా 'మౌలవీ'కి ఇచ్చి మిగతా నాలుగు అణాలకు జామపళ్లూ, మాజీడీలూ కొన్నాడు. ఇద్దరూ తిన్నారు. 1ఇంతలో ఆయన పెదతండ్రి వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి "రూపాయి దొంగిలించారా?" అని అడిగాడు. "అవును! తమ్ముడు ఒక రూపాయి తెచ్చాడు" అన్నాడు ఆయన కొడుకు. "ఆ రూపాయెక్కడ?" గర్జించాడు పెదనాన్న. "మౌలవీ ఫీజు ఇచ్చాము." ప్రేంచంద్ జీవితం శివరాణీదేవి