
PRIYA SARIGAMALU
₹150
In stock · 11 available
PublisherLATA KANDIKONDA
LanguageTelugu
ముందుమాట ఒక విధంగా చెప్పాలంటే ఇవి నా "సెకండ్ ఇన్నింగ్స్ కథలు” అని చెప్పాలి. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్ళీ నా రచనా ప్రక్రియ అమెరికాలో మొదలు పెట్టడం జరిగింది. అంతకు మునుపు అంటే 1968వ సం॥ నుండి 1988వ సం॥ వరకు నేను రాసిన కథలు ఆ నాటి వివిధ పత్రికలలో ప్రచురింపబడి, వై.యస్. లత కథలుగా 'యవనిక' పేరుతో పుస్తక రూపం దాల్చడం జరిగింది. ఆ తర్వాత నా చేత రచనా వ్యాసంగాన్ని తిరిగి చేత పట్టించిన ఘనత అమెరికాలో పుట్టి పెరిగిన నా చిన్నారి ముద్దుల మనవరాలు ‘తన్వి పుచ్చా' కే దక్కిందని చెప్పక తప్పదు. చిన్నప్పుడు దాని ముద్దు ముద్దు మాటలూ, చిలిపి అల్లరి, సందేహాలూ నన్ను మళ్ళీ రచనకి శ్రీకారం చుట్టేలా చేశాయి. మా ఆడపిల్లలిద్దరూ పెళ్ళిళ్ళయ్యాక కుటుంబాలతో అమెరికాలో స్థిరపడడంతో తరచూ అమెరికాకి వెళ్ళి రావడం జరిగేది, జరుగుతోంది. ఈ నా కథాసంపుటిలోని చాలా కథలలో అమెరికా, అక్కడి వాతావారణం ప్రవాస భారతీయుల ఇష్టాలు, కష్టాలు గురించి నాదైన రీతిలో రాయడం జరిగింది. నేటి సమాజంలో - భార్య, భర్త, వివాహం- వీటి నిర్వచనం మారిపోయింది. ఎంత త్వరపడి ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారో, అంతే త్వరగా విడిపోతున్నారు. విడాకుల రేటు పెరిగిపోయింది. ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ చూసినా 'న్యూక్లియర్ ఫామిలీస్' మాత్రమే కనబడుతున్నాయి. ఇదివరకులా ఇప్పుడు ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. విడాకుల రేటు పెరగడానికి ఇది కూడా ఒక కారణమేమో! ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచీ, చెడ్డా నచ్చజెప్పి కాపురాలు నిలబడేలా చేసేవారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎక్కడ చూసినా 'అనాథ శరణాలయాలు' దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తోంటే మా రోజులే బాగున్నాయి అని అన్పించక మానడం లేదు. 'ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్' అని అనుకోక తప్పడం లేదు.