
PROPERTY - REAL ESTATELO PETTUBADULU ELA PETTALI ? LABHALU ELA PONDALI ?
₹200
In stock · 3 available
PublisherSRINIVAS MUDDAM
LanguageTelugu
రియల్ ఎస్టేట్ రంగంపై వస్తున్న తొలి తెలుగు పుస్తకం ఇది! ఈ పుస్తకంలో స్థిరాస్తి రంగానికి సంభందించిన అనేక అంశాలు చర్చించబడ్డాయి. భూములు, ఇండ్లు, ఇతర ఆస్తుల కొనుగోలు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ముఖ్యమైన సలహాలు, సూచనలు పేర్కొనబడ్డాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికీ ఇదొక మార్గదర్శిలా తోడ్పడుతుంది. బ్యాంకింగ్ పైనాన్స్ రంగంపై ఇప్పటికే ఈజీలోన్ పేరుతో తొలి తెలుగు పుస్తకాన్ని అందించిన ముద్దం శ్రీనివాస్ గౌడ్ ఈ పుస్తకానికి కూడా రచయిత. శ్రీనివాస్ గౌడ్ రాసిన మొదటి పుస్తకం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వేలాది కాపీలు అమ్ముడవుతున్న నేపథ్యంలో ప్రాపర్టీటైమ్స్ పేరుతో రెండో పుస్తకం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పుస్తకంలో.. * ఇల్లు లేదా స్థలం కొనేముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? *పెట్టుబడి ఎక్కడ పెడితే లాభం? * స్థిరాస్తి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? * వేలంలో ఇల్లు కొంటున్నారా? జాగ్రత్తలు ఇవీ! * ఇంటికి బీమా... తీసుకోవాలా? వద్దా? * హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి? * స్థిరాస్తి బ్రోకర్లతో జాగ్రత్త * పెట్టుబడికి మంచి లాభం రావాలంటే ఓపెన్ ప్లాట్ ఎక్కడ కొనాలి? * పాత అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి * వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చాలంటే ఏం చెయ్యాలి? ఇలా.. స్థిరాస్తి రంగానికి సంభందించి అనేక ప్రశ్నలకు, ఎన్నో అనుమానాలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. పరిష్కార మార్గాలు కనబడతాయి. ఈ పుస్తకంలోని పలు వ్యాసాలు ఇప్పటికే ప్రముఖ తెలుగు దినపత్రికలైన నమస్తే తెలంగాణ సహా ఇతర పత్రికల్లోనూ పబ్లిష్ కావడం విశేషం! ప్రాపర్టీటైమ్స్ PUBLISHED FROM TIMESBIZ