
PURATANA SAMAAJAM - 300
by DR.MAHIDHARA RAMAMOHANA RAO
₹300
In stock · 207 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మా మాట మోర్గను మహాశయుడు 1877 సం॥లో ఆంగ్లభాషలో 'ది ఏన్షెంట్ సొసైటీ' వ్రాశారు. వారి జీవితకాలంలోనే యీ పుస్తకం మేధావుల్లో, పరిశోధకుల్లో గొప్ప సంచలనం కల్గించింది. విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి. అమెరికాలోను, ఇంగ్లాండులోను యీ పుస్తకాన్ని దొరక్కుండా చేశారు. అయినప్పటికీ మానవ శాస్త్ర, సాంఘిక శాస్త్ర పరిశోధకులకు కరదీపికయై, ఆర్థిక, రాజకీయ శాస్త్రవేత్తలకు శాస్త్రీయ అధ్యయనమునకు తోడ్పడినదై, తరువాతి తరంవారికి ఆధార గ్రంథమై కాలక్రమేణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1. మోర్గను పుస్తకం మీద మార్పు ఏంగెల్సులు తమ భావి రచనల కోసం 'నోట్సు' తయారు చేసుకున్నారు. 2. 'కుటుంబం పుట్టుక - పూర్వోత్తరాలు, రాజ్యాంగం' పుస్తకంలో ఏంగెల్సు అనేకచోట్ల మోర్గన్ను ఉటంకిస్తూ, ప్రతి ఒకరు మోర్గను పుస్తకాన్ని చదివి తీరాల్సిందే' అన్నారు. 3. డార్విను సిద్ధాంతం ఎంతటి అపురూపమైందో, మార్పు అదనపు విలువను కనిపెట్టడం ఎంతటి అసాధారణ విషయమో, అంతటి మహత్తరమైనదీ గ్రంథం అని ఏంగెల్సు చెప్పారు. డార్విను, మార్కు, ఎంగెల్స్, మోర్గను సమకాలికులు అవడం విశేషం. ఇది ప్రకృతి చేసిన సహాయం. ఒకే వాక్యంలో యీ పుస్తకమిచ్చే సందేశాన్ని ఇలా చెప్పుకోవచ్చు- 'ఈ విశ్వమొక కుటుంబం, మన పూర్వీకులు ఒక్కరే, మానవులంతా ఒకటే; ప్రపంచంలో అంతటా వారి పురోగతి కూడ కొంచెం ముందు వెనుకగా ఒకే విధంగా సాగింది.' ఇటువంటి గొప్ప గ్రంథాన్ని మోర్గను వ్రాశాడంటే సరిపోదు, ఇందులోని సమాచారం సేకరించడానికి ఆయన పడిన శ్రమ ఇంతా అంతా కాదు. రెడ్ ఇండియనులు నిరుపేదలు. వారిది దయనీయస్థితి. మోర్గను వారికి వకీలు కావడం వలన రెక్ఇండియన్లకు న్యాయం చేకూరింది. వారు అమితానందంతో మోర్గన్ ను వెంట తీసుకొని వెళ్ళి తమ మధ్యనే జీవిస్తూ సాయపడుటకుగాను దత్తత చేసుకున్నారు. ఇలాంటి ఘట్టాన్ని ప్రపంచ చరిత్రలో మరెక్కడా చూడం. పురాతన సమాజం బూయీహెన్రీ మోర్గన్