PV MANA TV by CHEEKOLU SUNDARAIAH Telugu book cover

PV MANA TV

by CHEEKOLU SUNDARAIAH

₹60
In stock · 3 available
PublisherSURABHI EDUCATIONAL SOCIETY
LanguageTelugu
చీకోలు సుందరయ్య ఈనాటి ఆధునిక సాహిత్యం బహుముఖీనంగా సాగుతోంది. సమాచార సాహిత్యం, విశ్లేషణా సాహిత్యం, పరిచయ సాహిత్యం, జీవిత చరిత్రలు ఇలా ఆధునిక సాహిత్యం అనిపించుకుంటున్న అన్ని సాహిత్య రంగాల్లో తనదంటూ ఒక కొత్త ముద్ర వేసిన రచయిత చీకోలు సుందరయ్య. ఆయన కలంనుంచి పత్రికల్లో వెయ్యికి పైగా ఇంటర్వూలు, కొన్ని వందల పరిచయ వ్యాసాలు, కథలు, కథానికలు, కవితలు, విశ్లేషణలు, వినియోగదారుల విజయాలు ఇలా ఎన్నో వచ్చాయి. సంపాదకుడిగా 50కి పైగా కవితా సంకలనాలు, కథా సంకలనాలు, వ్యాస సంకలనాలున్నాయి. ఇటీవలి కాలంలో జీవిత చరిత్రల మీద దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. డా. కె.వి. రమణాచారి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని "ప్రజలు.. ప్రభుత్వం... ఒక ఐఏఎన్" గా రాసి రమణ అభిమానులకు చేరువయ్యారు. ఇప్పుడు తెలుగు వారి నిలువెత్తు సంతకమైన పీవీ నరసింహారావు గారి మీద ఈ గ్రంథం వచ్చింది. ముచ్చటగా మూడో జీవిత చరిత్రను కూడా సిద్ధం చేస్తున్నారు. సాహిత్యంలో కొత్తదనం కనబడితే ఆనందంగా హత్తుకోవడం సుందరయ్యకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలను ఒడిసిపట్టుకోవడం, వాటికి తనవంతుగా ఔచిత్యమైన మార్పులను చేస్తూ ఉండడం అంటే సుందరయ్యకు సరదా ! పాఠకులకు అన్ని విడమర్చి చెబుతున్నట్లు అనిపిస్తూనే వారిని ఆలోచింప చేసే దిశగా మళ్లించడం ఆయన ప్రత్యేకమైన స్టైల్ !!