QUICK RAMADIES by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

QUICK RAMADIES

by SHANMUKESWARA PRACHURANALU

₹50
In stock · 1 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
డా॥ జి.వి. పూర్ణచంద్ మావిచిగురు తినగానే మీరూ గానకోకిలలై పాడతారు మావిచిగురు తినగానే కోయిల కూసేనా? అని పాటవుంది మామిడి చిగురు ఉన్నంత మాత్రాన కోయిల కూస్తుందా...? కోయిలే కాదు మామిడిచెట్టు లేత చిగుళ్ళు అంటే మనం కూడా శ్రావ్యంగా పాడగలుగుతాం. గొంతు శుద్ధి అవుతుంది. ఈ లేత చిగుళ్ళని మెత్తగా దంచి, నీళ్ళలో కలిపి బాగా మరిగించి, చిక్కటి సాయంతీసి వడగట్టి పంచదార కలుపుకొని తాగితే మంచిది. ఈ కషాయాన్ని పంచదార వేయకుండా, నోట్లోపోసుకొని పుక్కిలిస్తే గొంతు, వ్యాధులన్నీ తగ్గి, గొంతు శుద్ధి అవుతుంది. తలలో పేలు పోవడానికి సీతాఫలం గింజల్ని పట్టించండి సీతాఫలం గింజల్ని సేకరించుకొని, శుభ్రంగా కడిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. వీలైతే సీతాఫలం లేతాకుల్ని కూడా ఎండించి దంచి, శ రెండింటి మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకొని, కాసింత నీరుపోసి తడిపి తల పట్టించండి. ఒక అరగంట తర్వాత తలంటి పోసుకోండి. తలలో పేలు పోతాయి తలలో పుళ్లు తగ్గుతాయి. శరీరంమీద పుళ్ళకుకూడా ఈ పొడిని రాయవచ్చు. నెలలో మూడురోజులు నొప్పితో బాధపడ్తున్నారా... మీకోసం కొన్ని ఔషధాలు నెలసరి సమయంలో నొప్పి ఆడవాళ్ళ పాలిట నిజంగా శాపం అనే అనుకోవాలి. నెలలో ఆ మూడురోజులూ నొప్పితో కృంగిపోతుంటారు చాలామంది. 1. పసుపుకొమ్ముల్ని సున్నంలో వుడికించి, చల్లారాక పసుపుకొమ్ముల్ని మెత్తగా తరిగి, ఎండబెట్టి దంచితే చక్కని పొడి వస్తుంది. ఒక చెంచా మోతాదులో ఈ పొడిని 3 పూటలా రోజూ మజ్జిగతో కలిపిగాని, తేనెతోగానీ తీసుకోండి. నెలసరి నొప్పి తగ్గుతుంది. 2. నేల ఉసిరిక మొక్క విశాలంగా వున్న ప్రతిపెరట్లోనూ పెరుగుతుంది. ఈ మొక్క చిన్న ఉసిరి మొక్క ఆకారంలోనే వుంటుంది. ఇది అరఅడుగుకన్నా శ్రీ మధులత పబ్లికేషన్స్