RAASALEELA MAHAKAVYAMU by DR.AKONDI AMARAJYOTHI Telugu book cover

RAASALEELA MAHAKAVYAMU

by DR.AKONDI AMARAJYOTHI

₹126
In stock · 5 available
PublisherDR.AKONDI AMARAJYOTHI
LanguageTelugu
డా॥ ఆకొండి విశ్వనాథ విరచిత శ్రీ బృందావన మాహాత్యంబను రాసలీల కథాసంగ్రహము : రాసావతరణంబను ప్రథమోల్లాసము (1-182) శ్రీకృష్ణ హృదయరాజ్ఞియైన రాధాదేవిని స్మరించి, శంకరుడు కైలాసగిరిపై నిండుకొలువు తీర్చినాడు. పార్వతీ పరమేశ్వరులను సకల భూతగణాలు సేవిస్తున్నాయి. దేవగణాలు స్తుతిస్తున్నాయి. గణపతి, కుమారస్వామి పాదపూజ చేశారు. పార్వతి, విశ్వపతికి నమస్కరించి, స్వామీ! ఏకంసత్- అనికదాశ్రుతి. అనాది పురుషుడొక్కడే అని వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. ఆ పరమాత్మయే రెండు రూపాలు ధరించి, నాయికా నాయకులై సర్వరసాలను ప్రకాశింపజేస్తున్నాడు. తానే, నాయికారూపంలో, అందరకూ ఆరాధ్యదైవమై, “రాధ”యని వేదవిదులచే పిలవబడుచున్నాడు. ఆ రాధాకృష్ణుల దివ్యకథను వినిపింపుడని ప్రార్ధించినది. అంత, చిన్నగవులుచిందించు విశ్వనాథుడు రసానందముప్పొంగ, ఇట్లనియె. ఓదేవీ! సర్వమంగళా! ఇది సామవేద రహస్యము. ఒక్కడే పరమాత్మ. అతడే సత్యంశివం సుందరం. అదేసచ్చిదానందం. ఆ పరమ ప్రేమైక రసానందమే రాధ గాను, కృష్ణుడుగానుమారి, రసరమ్యమగు దివ్యలీలలను, విశ్వచైతన్యమునకై సృజించె. శ్రీ రాధాకృష్ణ నామ చింతామణి, భక్తరక్షామణి-ముక్తి చూడామణి! శక్తిని, భక్తిని జీవన్ముక్తిని ముక్తిని ప్రసాదించు శ్రీ బృందావన మాహాత్మ్యంబను రాసలీలను తెలిపెదను, అని సతితోపల్కిన విశ్వపతి, కైలాస వాసులతో, మీరందరు విని తరించుటకై భవాని ఇట్లు కోరినది. ఆమెకు తెలియని సత్యములేదు. ఇది విన్నవారందరూ, ఇహపరాల్లో సుఖసంతోషాలు పొందుతారు. ధనవంతులై సమస్త భోగాలు అనుభవించి, విజయాలుపొంది కోర్కెలు నెరవేర్చుకొన్నవారై, అంత్యకాలంలో రాధాకృష్ణ స్మరణచేసి, రాధికాసకియలై, గోలోకంచేరి రాసానందం పొందుతారు. అందుకే ఈ రాసమహిమలను శ్రద్ధగావినండి. రాధాకృష్ణ నామామృతాన్ని గ్రోలి తరించండి! అని పల్కిన విశ్వనాధుడు - ముందుగ, శ్రీరాధాదేవి దివ్యావతరణగాథను వినిపింపసాగె.