RAAVI CHITTI GEYALU by RAAVI RANGARAO Telugu book cover

RAAVI CHITTI GEYALU

by RAAVI RANGARAO

₹25
In stock · 10 available
PublisherRAAVI RANGARAO
LanguageTelugu
1952 జూలై 10న గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో రావి వీరయ్య, అచ్చమ్మ దంపతులకు జన్మించిన రంగారావు అనంతవరప్పాడు ప్రాథమిక పాఠశాలలో, పాత గుంటూరు యాదవ ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో, ఆంధ్ర లూథరన్ విద్యా కళాశాలలో చదువుకున్నారు. మచిలీపట్నం, ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కళాశాలలో 32 సం.లు తెలుగు అధ్యాపకుడిగా... ప్రిన్సిపాల్గా (2010 వరకు), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా విభాగం "బోర్డ్ ఆఫ్ స్టడీస్” అధ్యక్షుడుగా (2010) పని చేశారు. “అమృత వృక్షం”, “రావి శతకం”, “వింటివా ఏడుకొండల వేంకటేశ!” (సామాజిక శతకం), అశ్వత్థ వృక్షం... పద్య కవితలు, సంపుటాలు ప్రచురించారు. "కుంకుడుకాయ”, “రేజరులో సూర్యుడు”, “ముఖంపుల్ల”, “తెల్ల చీకటి”, "కలలో కవిత", "సూర్యుళ్ళ గెలుపు", "సూర్య రసం”, “సూర్యుడిని నెత్తి కెత్తుకొని"... అనే వచన కవితల పుస్తకాలు వచ్చాయి. కవితాలోచనం, వచన కవితోదయం, కవితాంతరంగం, మినీ కవిత-శిల్ప సమీక్ష, "మినీ" కవితలలో “మెనీ” భావాలు (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం), పిల్లలలో కవిత్వ రచనా నైపుణ్యాలు (పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం)... అనేవి వీరి సాహిత్య, పరిశోధన గ్రంథాలు. “తెలుగు బోధనా ప్రదీపిక" (బి.ఎడ్., డి.ఎడ్., తెలుగు పండిట్స్ కోర్సుల కోసం), “బోధనాంతరంగం” (తెలుగు బోధన మూల్యాంకనం స్కేళ్ళు) బోధనా శాస్త్ర గ్రంథాలు. రావి పొడుపు కథలు, రావి బాల గేయాలు, రావి బాల కథలు, రావి చిట్టి గేయాలు మొదలైన బాల సాహిత్య గ్రంథాలు కూడా వచ్చాయి. గుడ్మార్నింగ్, అగ్గిపెట్టె (తెలుగు-ఆంగ్లం-హిందీ), గుండె దీపాలు, ఎన్నికల చెణుకులు, వెలుతురు వేళ్ళు, వెలుతురు వేళ్ళు (కన్నడం), సబ్బు బిళ్ళ... మినీ కవితల సంపుటాలు, “సామాజిక హైకూలు” వచ్చాయి. శతావధాన కవితా ప్రసాదం (డా. రాళ్లబండి కవితాప్రసాద్ శతావధాన పద్యాల వ్యాఖ్యానం), ద్విశతావధాన కవితా ప్రసాదం (డా. రాళ్లబండి కవితా ప్రసాద్ ద్విశతావధాన పద్యాల వ్యాఖ్యానం), సునామీ (వచన కవితల సంకలనం), వెయ్యి నూట పదహార్లు (1970 నుండి 2005 వరకు 470 కవుల 1227 ఉత్తమ మినీ కవితల సంకలనం), మినీ కవిత-2006, మినీ కవిత-2007, మినీ కవిత-2008, మినీ కవిత-2009, తొలిపంట (విద్యార్థుల కవితలు), అక్షర ప్రతిభ (పోటీ కవితలు), మన బందరు (కవితల సంపుటి), బొట్టు (తేటగీతి పద్య సంకలనం) మొదలైన పుస్తకాలకు సంపాదకులు. "రావి రంగారావు రచనలు, ఒక పరిశీలన”-బి. శ్రీలవ పద్మశ్రీ, (ప్రొ. ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణ), రావి రంగారావు "కుంకుడు కాయ", ఒక పరిశీలన- అంకెం శ్యామల (ప్రొ. వి. సిమ్మన్న), "రావి రంగారావు మినీ కవితలు, ఒక పరిశీలన" - చిత్రపు కిరణ్మయి, (ప్రొ. జి. కృపాచారి), “రావి రంగారావు పద్య కవితలు, ఒక పరిశీలన" - ఓలేటి ఉమాసరస్వతి, (ప్రొ. కొడాలి సోమసుందరరావు), "రావి రంగారావు సాహిత్యానుశీలనం"- చుక్కా యశోద, (ప్రొ. గుమ్మా సాంబశివరావు)... రావి రంగారావు రచనలపై వచ్చిన పరిశోధన గ్రంథాలు.