RACHANA SAMAYAM by MUKTHAVARAM PARTHASARADHI Telugu book cover

RACHANA SAMAYAM

by MUKTHAVARAM PARTHASARADHI

₹49
In stock · 34 available
PublisherMUKTHAVARAM PARTHASARADHI
LanguageTelugu
కథకులు చెప్పిన కబుర్లు రచనా ప్రక్రియ గురించిన కబుర్లివి. వివిధ రచయితలు తమ అభిప్రాయాల్ని మనతో పంచుకున్నారు. చెప్పినవి వాళ్ల అనుభవాలు. ఎంతవరకు పనికొస్తాయో ఎవరికివారే తేల్చుకోవాలి. స్వానుభవంతో సరిపోల్చుకోవాలి. 1. మన అనుభవంలోని ఏ విషయాన్నైనా నవలగా మలచవచ్చు. చిన్న పిల్లలు చెట్లకొమ్మలు పోగుచేసి అరణ్యాల్నీ, గులకరాళ్లు కుప్పగా పోసి పర్వతాల్నీ సృష్టించగలరు. వయసు పెరిగినకొద్దీ మనలో ఈ ఊహాశక్తి తగ్గిపోతుంది కాబోలు, ఏ వస్తువునైనా ఉన్నదున్నట్టుగా గాక మరింత పెద్దదిగానో, మరో వస్తువుగానో ఆ వస్తువు తన జీవితంలో అత్యంత ప్రధానంగా మారిన మరొక వ్యక్తి చూసినట్టుగా ఊహిస్తే అదే కధ. 2. "కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు పరస్పరం ప్రభావితం చేసుకుంటే ఏదైనా కథే, అర్థవంతమైన కథనం ఉండాలని వేరే చెప్పనవసరంలేదు. కొన్నిసార్లు కథ లేదా నవల రాయాలనుకుని స్కెచ్ లేదా వ్యాసం లేదా రెండూ కలిపిన మరో వంటకమేదో తయారు చేస్తాం. అదీ కాకపోతే అభిప్రాయాలు చెప్పే సంపాదకీయం. కాని రాయాల్సింది కధ” 3. పాఠకుణ్ణి ఆకట్టుకునే ఒక ప్రక్రియ 'కథ' అనుకుంటే అందులోని ప్రతి వాక్యమూ, ప్రతిభాగమూ అందుకనుకూలంగానే ఉండాలి. ప్రారంభంలోనే ఉత్కంఠ రేకిత్తించగలగాలి. ఆ తర్వాత పాత్ర చిత్రణ, వాళ్ల పరస్పర సంక్లిష్ట సంబంధాలు, సమస్యలు మొదట విపరీతంగా కనిపించి తర్వాత అనుకోని పద్ధతిలో పరిణామం చెందుతాయి.