RACHAYITHA - SHILPAMU by ILVA V HRENBARG Telugu book cover

RACHAYITHA - SHILPAMU

by ILVA V HRENBARG

₹25
In stock · 273 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పరిచయం ఇల్యా ఎహ్రెన్బర్గ్ సోవియట్ యూనియన్ సాహితీ రంగంలోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రచయిత. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో యుద్ధ రంగం నుండి కలాన్ని శత్రుగళాల్ని ఛేదించే పదునైన ఆయుధంగా ఉపయోగించాడు. భారతీయ అభ్యుదయ రచయితలకు కూడా ఈయన కొత్త కాదు. సతీసమేతంగా భారతదేశం సందర్శించిన సందర్భంగా మద్రాసులో ఆంధ్ర అభ్యుదయ రచయితలను కలుసుకొన్నాడు. నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ రచనకోసం పాఠకులు పదే పదే ఉత్తరాలు రాస్తున్నారంటే దీని విలువ వేరే చెప్పనక్కరలేదు. ఈ గ్రంథంలో లేవనెత్తిన అనేక సమస్యలను, లోటుపాట్లను అధిగమించి సోవియట్ రచయిత నూతన సాహిత్య సృష్టిచేస్తున్న మాట నిజమే, కాని ఈనాటికీ మనలాంటి దేశాలలో తలెత్తుతున్న వాదవివాదాలను పరిష్కరించేందుకు సహాయపడగల ఈ గ్రంథాన్ని పునర్ముద్రించుతున్నాం. అనువాదాన్ని పునఃపరిశీలించి, సవరించి ముద్రిస్తున్న ఈ గ్రంథాన్ని పాఠకులు ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం. ప్రకాశకులు