
RACHAYITHALU PRACHURANA KARTHALU VIDHIGAA PATINCHAVALASINA PRATHAMIKA KARTHAVYALU
₹10
In stock · 28 available
PublisherCHALAPAKA PRAKASH
LanguageTelugu
నా మాట ప్రియమైన రచయిత మిత్రులకు నమస్కారం! సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేవాడు రచయిత. సమాజంలో అనేక రుగ్మతలను ఎత్తిచూపి తద్వారా సరైనరీతిలో సన్మార్గంలో నడిపే దిక్సూచి రచయిత, అటువంటి సమాజసేవ చేస్తున్న రచయిత యొక్క బాగోగులు మాత్రం ఎవరూ పట్టించుకోరు. గతంలో రాజ్యాలను ఏలిన మహరాజులు, చక్రవర్తులు కవులను, రచయితలను ఆదరించి ఎన్నో గ్రామాలను సైతం వారికి అర్పించి పోషించేవారన్నది చరిత్రలో చదివాం. కాని నేటి ప్రజాస్వామ్య కాలంలో ప్రభుత్వాలు అరకొరగానే, మొక్కుబడిగానే అవార్డుల పేరుతో చాలా స్వల్పరీతిలో కవులను, రచయితలను పట్టించుకుంటున్నాయి తప్పించి సరైనరీతిలో ఆదరించట్లేదు. పత్రికలకు కూడా (తెలుగులో ఒకటి రెండు పత్రికలు తప్పించి) పెద్ద పత్రికలు కూడా రచయితలకు తగురీతిలో పారితోషికాలు ఇస్తున్న దాఖలాలు లేవు. ఏవో సాహిత్య సంస్థలు పుస్తకా విష్కరణలు, ప్రముఖుల జయంతులు, వర్థంతులు, కవిసమ్మేళనాలు, సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలతో సరిపెట్టేస్తున్నాయి. చాలా కొన్ని సంస్థలు మాత్రమే చెప్పుకోతగ్గ ఆర్థికరీతిలో కవులను, రచయితలను పోషించగలుగుతున్నాయి. ఇన్ని చేస్తున్నా రచయితలు రాసిన రచనలకు సరైన పారితోషికాలిచ్చి ప్రచురించి పోషించే పుస్తక ప్రచురణకర్తలు తెలుగు సాహిత్యరంగంలో పెద్దగా లేరనే చెప్పాలి. కవులు, రచయితలు తమకు తామే ప్రచురించుకున్నా వాటిని మార్కెట్లో అమ్ముకొని కనీసం తాము ఆ పుస్తకాలపై పెట్టిన సొమ్మును రాబట్టుకునే పరిస్థితి తెలుగు రచయితలకు లేదు. కొన్ని పుస్తక విక్రేతలు ఆ బాధ్యత తీసుకున్నా చాలా విక్రయకేంద్రాలు తిరిగి రచయితలకు ఆ సొమ్ము ఇస్తున్న దాఖలాలే లేవు. కేవలం తాము చేసుకుంటున్న వృత్తి లేదా ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ముతోనో లేదా అప్పోసోప్సో చేసో తాము రచించిన గ్రంథాలని ప్రజల చెంతకు చేర్చాలనే ఉబలాటంతో కవులు రచయితలు, పుస్తకాలు ప్రచురించుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది రచయితలకు అసలు ప్రభుత్వ గ్రంథాలయాలు, కలకత్తాలోని రాజారామమోహనరాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అనే వ్యవస్థలు