
RADHA MANOHARAM
₹40
In stock · 61 available
PublisherSASI PRACHURANALU
LanguageTelugu
అనంతపురం జిల్లా, పెనుగొండ తా|| నల్లగొండ్రాయని పల్లెలో ది. 08-11-1936న శ్రీమతి కృష్ణమ్మ, వెంకటప్ప గార్లకు జన్మించిన గంగప్పగారు పెనుగొండ, అనంతపురం, విశాఖపట్టణాలలో చదివి 1960లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుంచి బి.ఏ. ఆనర్స్/ఎం.ఏ. తెలుగాభాషా సాహిత్యాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై 1972లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. డిగ్రీ పొందారు. 1960లో ప్రభుత్వ విద్యాశాఖలో చేరి 1978 వరకు అనంతపురం, కాకినాడ, విశాఖపట్టణం, హైదరాబాద్ ప్రభుత్వ కళాశాలలలోను, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలోను ఆంధ్రోపన్యాసకులుగా, శాఖాధ్యక్షులుగా పనిచేశారు. 1978లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా చేరి, 1983 లో రీడర్ పదవినీ, 1988లో ప్రొఫెసర్ పదవిని చేపట్టి, 1989-91లో శాఖాధ్యక్షులుగా, 1994-96లో పాఠ్యనిర్ణాయక సంఘాధ్యక్షులుగా కొనసాగి, 30-11-1996లో పదవీ విరమణ చేసి, అవిశ్రాంతంగా సాహితీ రంగంలో కృషి చేస్తున్నారు. పలు సాహిత్య పత్రికల్లో 1500 వ్యాసాలు ప్రకటించి, 100కు పైగా సాహిత్య సదసులలో కాన్ఫరెన్సులలో పత్ర సమర్పణ చేశారు. పద, జానపద, నాటక, ప్రాచీనాధునిక సాహిత్యాల్లో పరిశోధక, విమర్శక, సృజనాత్మక గ్రంథాలు 104కు పైగా రచించి ప్రకటించారు. 1973, 1980లలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు, 1989, 1983లలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు, 1994లో విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు, 1991లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు ఇంకా ఇతర అనేక అవార్డులు పొందారు. 11-4-2013 శ్రీ విజయనామ సం|| ఉగాది 'హంస' (కళారత్న) పురస్కారం: ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి, హైదరాబాద్. వివిధ విశ్వవిద్యాలయాల్లో పునశ్చరణ తరగతుల్లోను, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఫెలోగాను, యు.జి.సి. జాతీయాధ్యాపకులుగా బెనారస్, అలీగఢ్, శ్రీ వేంకటేశ్వర, మద్రాసు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లోను అనేక ప్రసంగాలు చేశారు. 27 పిహెచ్.డి. డిగ్రీలు, 20 ఎం.ఫిల్ డిగ్రీలు ఆచార్య గంగప్ప పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు పొందారు. గంగప్ప గారి రచనలమీద 3 పిహెచ్.డి., 3 ఎం.ఫిల్. డిగ్రీలు వచ్చాయి.