
RAGALU BAVALU
₹50
In stock · 47 available
PublisherDR.V.VEERACHARI
LanguageTelugu
రాగాలు - భావాలు నా పాట - మాట నేను గిరిగీసుకొనే కట్టుబడి కవిని కాను. సిరులు మూటకట్టుకునే పెట్టుబడి కవిని కాను. కాలంతో ప్రవహించే కవిని. సమాజంతో సంఘర్షణపడే కవిని. కాబట్టి అనుభవం నేర్పిన పాఠాలకు అక్షరరూపం ఇస్తుంటను. నా హృదయ తలుపులను తట్టిన భావానికి రెక్కలు తొడుగుతుంటాను. ఈ నేపథ్యంలోనే 1974-75 ప్రాంతంలో పాటతో నా కవితా ప్రస్థానం ప్రారంభమైంది. 'ఓ భారతి అందుకో హారతి' పాట మొదటి మైలురాయి. సందర్భం, స్పందన, రచనారూపం- ఇది నా సాహిత్యమార్గం. ప్రతి సందర్భం ప్రతి కవిలో స్పందనలను కలిగించకపోవచ్చు. ఇది నా ప్రగాఢ విశ్వాసం, నా అనుభవం కూడా. అందుకే నేను ఎక్కువ పాటలు రాయలేకపోయాను. ఇప్పటికి వందకుపైగా పాటలు రాసి వుంటాను. ఈ పాటలన్నీ దాదాపుగా నాలోని ఊహలు, సామాజిక జీవితం సంఘర్షణల ఫలితంగా పురుడు పోసుకున్నవే. సాధారణంగా సామాజిక స్పృహవున్న ప్రతికవి ఊహలపై వయసు ప్రభావం ఉంటుంది. దానితో సామాజిక జీవితానుభవం సంఘర్షణ పడుతుంది. ఫలితంగా ఒక రచన రూపుదిద్దుకుంటుంది. అది పాట, పద్యం, వచన కవిత్వం కావచ్చు. కథ, నాటకం, నవల ఏదైనా కావచ్చు. నా రచనలు అర్ధం కావాలంటే, వాటికి ఉండే భూమిక నేపథ్యం తెలియాలి. అందుకే నా ప్రతి రచనకు అవి పుట్టిన తేదీలను సాధ్యమైనంత వరకు ఇస్తూ వుంటాను. ప్రాచీన, మధ్య యుగాల్లో ఏదైనా మార్పు జంగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టేది. ఆధునిక యుగంలో అలా కాదు. విలువలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేనిలో విలువలున్నాయో, దేనిలో లేవో తెలుసుకునే లోపు కాలం మన చేయిదాటి పోతుంది. చేతులు కాలిన తిరువాత ఆకులు పట్టుకుంటే లాభంలేదు. కాబట్టి ఈ క్షణాన మనం నిజాయితీగా ఉన్నామా అన్నదే ఇవ్వాల్టి కొలమానం. ఇది అభ్యుదయ కాముకుల లక్షణం. ఎలా ఎదిగావన్నది, ఎలా