
RAGALU MARAYEE
by HYMA BHARGAV
₹100
In stock · 45 available
PublisherHYMA BHARGAV
LanguageTelugu
ముందుమాట రాగాలు మారాయి అనే నా నవలకు పదివారాల సీరియల్ పోటీలో బహుమతినిచ్చి, ప్రోత్సహించిన 'స్వాతి' బలరామ్ గారికి ముందుగా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. సినీ కళామతల్లి కంఠాభరణంలో ఆణిముత్యాలుగా మెరిసే గొప్ప సంగీత దర్శకులు ఎందరో వున్నారు. వారందరికీ వందనాలు. సంగీతపు, సాహిత్యపు కలనేతతో సృష్టించబడ్డ ఎన్నో మధురగీతాలు, మనస్సులో భావుకత్వాన్ని, కలల్నీ రేకెత్తిస్తాయి. 'పాట' అనేది అందరి 'నోట' పలికేది. సమిష్టి కృషితో వెలువడే సినీ గీతాలు చిరస్థాయిగా నిలబడే మధుర గీతాలుగా వుండాలంటే అందుకు ఆ కళాకారులు ఎంతో శ్రమించాలి. ఆ సంఘర్షణ, శ్రమ ఎలా వుంటుందనేది అందరికీ అర్ధం కాదు. అలాంటి గొప్ప కళాకారులను తలుచుకుంటూ సంగీత నేపధ్యంలో రాయబడ్డ 'రాగాలు మారాయి' అనే ఈ నవలను ఆదరించి, ఉత్తరాలు రాసిన పాఠకదేవుళ్ళకు నా వందనాలు. రికార్డింగ్ ధియేటర్ల వివరాలు చెప్పిన శ్రీ శ్రీ రమణగారికి కృతజ్ఞతలు. ఈ సీరియల్ను నవలగా ప్రచురించేటప్పుడు తెలుగు సినీ రంగంలోని సంగీత దర్శకుల గురించి కొన్ని వివరాలను కూడా దాంతోపాటు జతపరచాలని అనుకున్నాను. అందుకే నేను సేకరించిన వివరాలతో వ్యాసాలు వ్రాసి ఓ పుస్తకంలా జతపరుస్తున్నాను. సినిమా పాటల గురించి, సంగీత దర్శకుల గురించి రాసేటప్పుడు వచ్చిన సందేహాలను తీర్చిన 'హాసం' పత్రిక ఎడిటర్ శ్రీ రాజాగారికి నా కృతజ్ఞతలు.