RAGULUTUNNA ADAVI by MALUPU BOOKS Telugu book cover

RAGULUTUNNA ADAVI

by MALUPU BOOKS

₹290
In stock · 1 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076183
నేనెందుకు రాశానంటే.. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నాతోపాటు పనిచేస్తున్న రవీంద్ర రే మాటల సందర్భంలో నాకు ఓ ఘటన గురించి చెప్పారు. ఆయన 'నక్సలైటు' లేక సాయుధ విప్లవకారుడిగా పనిచేసిన 1970ల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమ్యూనిస్టు ఉద్యమాల ప్రేరణ ఆ రోజుల్లో మనుషులను కదిలించిన తీరు చుట్టూ ఈ కథ నడిచింది. ఓ యువకుడిని పోలీసు అరెస్టు చేశాడు. 'మీ నక్సలైట్లు వియత్నాం పేరుని అదేపనిగా కలవరిస్తుంటారు కదా! ఏదీ ఈ పటంలో ఆ దేశాన్ని చూపించు' అని పోలీసు ఎగతాళిగా మాట్లాడాడు. ఆ యువకుడు నిరక్షరాస్యుడు. తన చేతిని గుండెపై ఆనించుకొని, 'ఇదిగో నా గుండెల్లో ఉంది' అని సమాధానమిచ్చాడట! దక్షిణ ఛత్తీస్ గఢ్ లో 39,114 చదరపు కిలోమీటర్ల మేర పరుచుకొని ఉన్న అవిభక్త బస్తర్ గుండె ఇప్పుడు చిరిగిన పటంలా ఉంది. ప్రతిఘటన, మానసిక సంఘర్షణల మధ్య చిక్కబట్టిన ఈ గుండె రవరవలాడుతోంది. మావోయిస్టు గెరిల్లాలపై భారత ప్రభుత్వం జరుపుతున్న యుద్ధానికి ప్రధాన రంగ భూమి ఇది. అడవులను చీల్చుకొని అంతకంతకూ చొచ్చుకుపోతున్న ఇనుప ముళ్ళ తీగలు చుట్టిన క్యాంపులు, హెలికాప్టర్లు, రహదారుల రూపంలో భారత ప్రభుత్వమూ, ఎల్లలు లేని, రహస్య తంత్రుల మీద వినిపించే భూభాగాలపై మావోయిస్టులు నడుపుతున్న జనతన సర్కారు లేక ప్రజా ప్రభుత్వమూ తమ ప్రాతినిథ్యాలను ఇక్కడ చాటుకొంటున్నాయి. మావోయిస్టు రాజ్యంలోని ప్రజలు దృఢచిత్తంతోనే కదులుతున్నారుగానీ, వారికి గమ్యమే కనిపించడం లేదు. అనిశ్చితమైన, అపాయకర బాటల్లో వారి అడుగులు పడుతున్నాయి. తమతో కలిసొచ్చే సహచరులు ఎవరంటే చెప్పలేని పరిస్థితి వారిది. ఆ సందేహం వారిని అడుగడుగునా వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం, మావోయిస్టుల్లో ఎవరిని సమర్థిస్తావు అని ఓ వ్యక్తిని నేను అడిగాను "నా గుండెల్లో ఏముందో నాకు తెలుసు.