RAITHU RAYALU by GUTTI CHANDRASEKHARA REDDY Telugu book cover

RAITHU RAYALU

by GUTTI CHANDRASEKHARA REDDY

₹50
In stock · 28 available
PublisherGUTTI CHANDRASEKHARA REDDY
LanguageTelugu
తెలుగుదేశంలో కథలకు కరువులేదు. చెట్టూ పుట్టా కొండా కోనా పచ్చనాకూ పైరగాలీ- దేనిని పలుకరించినా ఏదో కులుకు. ఆ కులుకు నుండి పుట్టుకు వచ్చేవే పుట్టల పుట్టల కథలు. పురాణయుగం నుండీ నేటివరకూ కల్పనా చమత్కృతితో త్రుళ్లింతలాడుతూ, ఈ లోకంలోని సమస్త జీవద్వైభవాన్ని ఆవిష్కరించే కథలు. ఈ కథలు స్పృశించని జీవనపార్శ్వం ఉండదు! పురాణ పాత్రల నుంచీ చరిత్రకెక్కిన చక్రవర్తుల వరకూ, కీర్తి గడించిన అసామాన్య ప్రతిభామూర్తుల నుండి సామాన్యులైన బడుగు జీవుల వరకూ అద్భుతమైన కథలకు పాత్రమైనవారే! ఒక్కమాటలో చెప్పుకోవాలంటే - అసలు మానవజీవన ఇతిహాసమే ఒక అంతులేని బృహత్కథ! ఎన్ని కథలు వచ్చినా మనకు ఎందుకో దాహం తీరినట్లు ఉండదు! ఇప్పుడు సరికొత్తగా మనముందుకు వచ్చిన పద్యకథా కావ్యం 'రైతురాయలు' అందులోని చెరువు మనకు ఉండే కథాదాహం తీర్చడమే కాదు ఆ ఊరి బక్క రైతుల, పశుపక్ష్యాదుల దాహాన్నీ తీర్చింది. అంతేకాదు మట్టి తల్లి ఒడలంతా తడిమి, పొలాల్లో చెమ్మదనం నింపి, చుట్టుపక్కల పదిఊళ్లు పైరు పచ్చలతో కళకళలాడేట్లు చేసింది. అసలు ఈ రైతురాయలు పుట్టడానికి వెనుక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఎప్వుకుంటూ పోయేటప్పటికి మన కన్నుల ముందు చిరుచిరు అలలతో తొణికిసలాడుతూ నిండైన చెరువుగంగ సాక్షాత్కరిస్తుంది. ఒకవైపున సర్వకళా వైభవంతో దేశాన్ని ఏలిన మహారాజు మరొకవైపున రెక్కాడితేకాని చొక్కాడని మట్టికాళ్ల సేద్యపు రైతు- ఈ ఇద్దరి భవ్య సమ్మేళనంతో అవతరించిన ఈ పెనోళ్ళ చెరువు కథ / వెరసి రైతురాయలు అసలు ఎట్లా పుట్టి ఉంటుంది? ఇది చరిత్ర కథనమా? చమత్కార కథాకల్పనమా?