
RAITHU VYATHIREKA CHATTALAPAI TIRAGABADDA TRACTORLU
₹130
In stock · 6 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076251
అన్నదాతల ఆందోళన ఎందుకు? ట్రాక్టర్లు తిరగబడుతున్నాయెందుకు? ఇప్పడికి (ఫిబ్రవరి 10) 206 మంది రైతులు అమరులైనా సరే, రోడ్డుమీద సర్కారు వారు మేకులు నాటుతున్నా సరే, ఆందోళన జీవులు విదేశీ శక్తులు, టెర్రరిస్టులు ఖలిస్తానీయులు, అని ప్రభువులు, మంత్రులు, మాజీ సివిల్ అధికారులు రకరకాలుగా నిందిస్తూనే ఉన్నా సరే, రైతుల శాంతియుత సంఘటిత పోరాటం ప్రతీఘాత శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొంటూ సాగుతూనే ఉన్నది. దేశరాజధాని సరిహద్దుల్లో అగడ్తలతో పాటు కోటగోడల వలె అడ్డంకులు నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. రోడ్లు తవ్వి, మేకులు నాటి, కాంక్రీట్ ప్రతిబంధకాలు నిలిపి రైతులను కదలనీయకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. టిక్రీ, సింఘూ, ఘాజిపూర్ హద్దులలో ట్రాఫిక్ కదిలే అవకాశాలు ఇప్పట్లో లేవు. పియవూ మనియారీ, సబోలీ మంగేష్ పూర్ హద్దులు కూడా మూత పడ్డాయి. మరోవైపు ప్రధాని కనీస మద్దతు ధర ఉంటే కొనసాగుతూనే ఉంటుందని చేసిన ప్రకటన రైతులకు నమ్మశక్యంగా లేదు. ఎం ఎస్ పి పైన చట్టం చేస్తాననే మాట మాత్రం ఇవ్వడం లేదు. “దేశం నమ్మకాల మీద నడవదు. రాజ్యాంగం, శాసనాల పై నడుస్తుంద"ని రాకేశ్ తికాయత్ చెప్పారు. ఈ దేశంలో ఆకలితో వ్యాపారాన్ని అనుమతించబోం అని తికాయత్ హెచ్చరించారు. మూడు చట్టాలను ముగించడమే కాకుండా ఎం ఎస్ పి చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళన 77వ రోజున రాకేశ్ తికాయత్ ఉద్యమం తీవ్రతరం చేసేందుకు ఫిబ్రవరి 18 న నాలుగ గంటలపాటు రైల్ రోకో నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా పక్షాన ప్రకటించారు రాజస్తాన్ లో ఫిబ్రవరి 12 నుంచి టోల్ పన్నుల వసూళ్లు జరగనీయబోమనీ హెచ్చరించారు. మద్దతు ధరలను ఈ చట్టాలు మింగేస్తాయనీ, అన్నదాతలను పెద్ద కార్పొరేటర్ల కాళ్లదగ్గర కూలీలుగా పడేస్తాయని రైతులు భయపడుతున్నారు? ఈ భయాలు ఎందుకు కలుగుతున్నాయి? రైతులు ఇంతగా వద్దంటున్నా ఈ మూడు కేంద్ర చట్టాల్లోఏముంది? ఈ చట్టాల వెనుక శక్తులెవరు? దేశమంటే మనుషులా రైతులా లేక మార్కెటా? పుస్తకం తెరవండి, సమాధానాలు చదవండి.